జనసేన నేత సిజి రాజశేఖర్ అక్రమ అరెస్టు

పత్తికొండ నియోజకవర్గం: పత్తికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి మోహన్ మరియు ఆరుగురు కానిస్టేబుల్స్‌ పత్తికొండ నియోజకవర్గ జనసేన నాయకులు సిజి రాజశేఖర్ ఇంటి దగ్గర సోమవారం ముందస్తుగా సిజి రాజశేఖర్ ను అక్రమ అరెస్టు చేసి పత్తికొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ సోమవారం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రాష్ట్ర బంద్ లో జనసేన పార్టీ తరఫున జనసేన నాయకులు సిజి రాజశేఖర్ పాల్గొంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోఉన్నందుకు పత్తికొండ జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు సీజ రాజశేఖర్ ను పత్తికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.