చల్లగుండ్లలో ఘనంగా జనసేన పార్టీ నూతన జెండా ఆవిష్కరణ

సత్తెనపల్లి, నకరికల్లు మండలం, చల్లగుండ్ల గ్రామ పెద్దల సహకారంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో ఘనంగా చల్లగుండ్ల గ్రామంలో జనసేన పార్టీ నూతన జెండా మరియు ఇంటింటికి పవనన్న ప్రజాబాట నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెగా ఫ్యామిలీ వీరాభిమాని సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మరియు జనసేన పార్టీ స్టేట్ కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నూతన జెండా ఆవిష్కరణకు జనసైనికులు ఆహ్వానించడం జరిగినది. ముందుగా గ్రామంలో జనసైనికులు ఏర్పాటుచేసిన నూతన జనసేన పార్టీ జెండాను సత్తెనపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బొర్రా వెంకటప్పరావు మాట్లాడుతూ ఈ సైకో ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూని చేసి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయాల్లో హుందాతనం అనేది లేకుండా చేసిన ఈ సైకో ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు ఇంటికి పంపిద్దామా అని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని ప్రజలు ఇలాంటి చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిని ఇలాంటి మంత్రి వర్గాన్ని గెలిపించుకున్నటువంటి ప్రజలు ఈరోజు ఎంతో మనోవేదనకు గురై సిగ్గుపడుతున్నారని ఇలాంటి అసమర్థుల్ని ముఖ్యమంత్రిగా చేసిన పాపానికి తగిన ప్రతిఫలం ఇచ్చాడు అని ఆంధ్ర ప్రజలు అందరూ బాధపడుతున్నారని, ఈ ఆంధ్రరాష్ట్రం సుభిక్షంగా బాగుండాలంటే రానున్న ఎన్నికల్లో కొణిదెల పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా గెలిపించి ఈ సైకో ముఖ్యమంత్రిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు అసలు మనం మన రాష్ట్రంలో ఉంటున్నామా లేక బ్రిటిష్ పరిపాలన బ్రతుకుతున్నామా అనే విధంగా ఈ సైకో ముఖ్యమంత్రి పరిపాలన ఉందని ప్రజలు ఎంతో బాధపడుతున్నారని, ప్రజలు సరైన వానలు లేక కాలువల్లేక పంటలేసుకుని నష్టపోతుంటే ఆ సమస్యలు వదిలేసి నాయకులను ప్రతిపక్ష నాయకుల్ని రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వకుండా తన సైకో ఆనందాన్ని పొందుతున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మరొక్కసారి ఈ ముఖ్యమంత్రి వస్తే ఇక ఈ రాష్ట్రం నామరూపాలు లేకుండా చేస్తాడని ఈ ఒక్కసారన్నా ఆలోచించి మీ బిడ్డల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక అవకాశం కొణిదెల పవన్ కళ్యాణ్ గెలిపించి ముఖ్యమంత్రి చేసి ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా మనమందరం కలిసి కృషి చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేశారు. ఏ అవినీతి ఆరోపణ లేదు ఆయన కడిగిన ఆణిముత్యం అని అలాంటి వ్యక్తిని అరెస్టు చేశారుని ఈరోజు మాట్లాడుతున్న కొంతమంది వ్యక్తులు నాయకులు మొత్తం కూడా తెగ బాధపడిపోతున్నారు కదా మరి మా నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ ని అధికార పార్టీ ముఖ్యమంత్రి మంత్రులు ప్యాకేజీ స్టార్ దత్తపుత్రుడు అని మాట్లాడుతున్నప్పుడు మరి మీరు కనీసం మేము అతనికి డబ్బులు ఇవ్వలేదు తనని కొనే అంత దమ్ము మాకు లేదు అని ఆరోజు చంద్రబాబు నాయుడు గానీ దేశం పార్టీ నాయకులు గాని ఎందుకు ఖండించలేకపోయారు. ఈ విషయం మీకేనా ఆత్మాభిమానం ఆత్మగౌరవం మాకు ఉండవా? మా నాయకుడి గురించి మాట్లాడితే మాకు బాధ వేయదా? మా నాయకుడి మీద మాకు ప్రేమ ఉండదా? ఈరోజు మీదాకొస్తే తెలుస్తుందా ఆ బాధ అని బొర్రా తెలుగుదేశం పార్టీ మీద ధ్వజమెత్తారు. అనంతరం గ్రామంలోని జనసైనికులు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మండల అధ్యక్షులు కౌన్సిలర్ ప్రోగ్రాం కమిటీ మెంబర్స్ మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు నియోజకవర్గ జనసైనికులు వీర మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.