ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డకు రక్షణ కరువై రైల్వే స్టేషన్ లోనే సామూహిక అత్యాచారం: డేగల దొరస్వామి నాయుడు

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్ లో ఒక మహిళను తన భర్తను కొట్టేసి కట్టేసి సామూహిక అత్యాచారం జరిగి ఉంటే రైల్వే పోలీసులు ఏం చేస్తున్నారు. ఒక పక్క బీటెక్ విద్యార్థిని చంపిన హత్య కేసులో శశి కృష్ణకు ఇటీవల ఉరి శిక్ష వేసినా ఈ సంగతి తెలిసి కూడా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే రేపల్లె రైల్వే స్టేషన్ లో ఈ అత్యాచారం జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని సూచిస్తుంది. అంటే ఏ రాజకీయ నాయకుల అండ చూసుకుని ఇంత బలుపుతో ప్రవర్తిస్తున్నారు ఒక బల హీనమయిన శాసన సభ్యులకు ముఖ్యమంత్రి గారు కీలక మంత్రి పదవులు ఇచ్చి తన చేతిలో కీలుబొమ్మలను చేసి ఆడిస్తూ ఉంటే లాఅండ్ ఆర్డర్ ఎలా అదుపులోకి తెస్తారు.. రైల్వే పోలీసులు కూడా అంత సక్రమంగా డ్యూటీ చేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతున్నాయి అని జనసేన పార్టీ ప్రశ్నిస్తుందని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అడ్డారహితంగా పాలన చేయడం అలవాటు అయిపోయింది. ఒంగోలులో రిమ్స్ హాస్పిటల్లో అత్యాచారానికి గురైన బాధితురాలిని పరామర్శించ డానికి వెళ్లిన జనసేన రాష్ట్ర నాయకులను, వీరమహిళలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం ఒక విచిత్రమైన చర్య ఒక రాజకీయ పార్టీగా బాధితులను పరామర్శించే నైతిక హక్కు జనసేన పార్టీకి ఉంది. దీనిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం ఏంటి..? ఇలాంటి అరెస్టులు ఎన్ని జరిగినా బాధితులకు సరైన న్యాయం జరిగేదాకా ఇటువంటి అన్యాయం, ఇటువంటి అత్యాచారాలు మళ్లీ మళ్లీ జరగకుండా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడాలని జనసేన పార్టీ తరఫున డేగల దొరస్వామి నాయుడు డిమాండ్ చేశారు.