జనసేన పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్న జనసైనికుల జోలికి వస్తే సహించేదిలేదు

వైరా నియోజకవర్గం, పరిధిలో గల గన్నవరం గ్రామంలో ఇటీవల జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు పడుతున్న తరుణంలో అలాగే మొన్న జరిగిన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ తరఫున ఘనంగా నిర్వహించిన సందర్భంగా ఎక్కడ జనసేన బలం మరింతగా పెరిగి అధికార పార్టీకి మైలేజ్ తగ్గుతుందో అని స్ధానిక టిఆర్ఎస్ సర్పంచ్ భర్త అయిన (షాడో సర్పంచ్) కోటిరెడ్డి… మేడ అనిల్ అనే జనసేన క్రియాశీలక కార్యకర్తను బెదిరించడమే కాకుండా, పోలీస్ ఠాణాకు పిలిపించి విచక్షణారహితంగా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అనిల్ తల్లి ముందు నిన్ను చంపేస్తాను అని బెదిరించడం జరిగింది. ఈ విషయాన్ని వైరాకి చెందిన జనసేన యువజన విభాగ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరుట్ల రామకృష్ణ ద్వారా అనిల్ కుటుంబసభ్యులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రామ్ తాళ్లూరి జనసేన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ మరియు జనసేన పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దుంపటి శ్రీనివాస్ స్పందిస్తూ అక్కడికి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన యువజన విభాగ అధ్యక్షులు డేగల రామచంద్రరావుని గన్నవరం గ్రామం వెళ్లి జరిగిన సంఘటన పైన అనిల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి దైర్యం చెప్పి వారి కుటుంబానికి అండగా ఉండాలని కోరడంతో వెంటనే అక్కడికి చేరుకుని పూర్వాపరాలను పరిశీలించి ఈ మొత్తం సంఘటన జరగడానికి కారణమైన షాడో సర్పంచ్ కోటిరెడ్డి పై వైరా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి తక్షణమే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ఇటువంటి ఘటనలు మున్ముందు మరెక్కడా జరగకుండా చూస్తూ ఒకవేళ జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనసేన పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను, జనసైనికులను బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసినా చూస్తూ సహించబోమని వారికి అండగా నిలబడి ఎంతటి న్యాయపోరాటం చేయడానికైనా సిద్ధమని తెలియజేస్తూ ఇటువంటి ఉడత ఊపులకు జనసేన బయపడదని రానున్న రోజుల్లో పార్టీని ప్రతీ గ్రామంలో మరింతగా బలోపేతం చేస్తామని ఎంతటి కటిన పరిస్ధితులనైనా ఎదుర్కోవడం, అది తమ అధినేత చెప్పిన విధంగా ఎంత క్రిందికి తొక్కాలని చూస్తే అంతకంటే ఎత్తుకు ఎదుగుతామని స్పష్టంచేసారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మేడబోయిన కార్తీక్, బోనకల్ మండల మండల ప్రెసిడెంట్ తాళ్లూరు డేవిడ్, విద్యార్థి విభాగం గంధం ఆనంద్, షేక్ మాలిక్, ఉత్తం, గోపికృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.