జగనన్న కాలనీలకు దారేది: చల్లా రాజ్యలక్ష్మి

జగ్గంపేట నియోజకవర్గం: జగనన్న కాలనీలో నివాసముంటున్న ప్రజలకు నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి దారేది, నివాసానికి వెళ్లే దారి లేక నివాస్థిత ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ గోకవరం మండల మహిళ కన్వీనర్ చల్లా రాజ్యలక్ష్మి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా, గోకవరం
మండలం, గుమ్మలదొడ్డి గ్రామపంచాయతీలో జగనన్న ప్రభుత్వం నివాసితులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అక్కడ ఇల్లు నిర్మించుకున్న జగనన్న కాలనీ ప్రజలు సరైన రోడ్డు మార్గం లేక వారి నివాసానికి వెళ్లాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికి చెరువులను తలపించిన కాలనీలో ఇళ్ల స్థలాలు
ఎలా ఇచ్చారని చల్లా రాజ్యలక్ష్మి ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వంపట్టించుకోవడంలేదని జనసేన పార్టీ గోకవరం మండలం మహిళ కన్వీనర్ చల్లారాజ్యలక్ష్మి ఆరోపించారు. జనసైనికులతో ఆ కాలనీని సందర్శించి చెరువును తలపిస్తున్న ఆ రోడ్లపై నడిచి నిరసన తెలియజేశారు. కాలనీ ప్రజలకు సరైన మార్గం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కాలనీవాసులకు సరైన మార్గాన్ని ఏర్పాటు చేసి నివాసిత ప్రజల ఇబ్బందులపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో ఉన్న స్థలాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించడమే ప్రధాన కారణమని ప్రభుత్వంపై మండిపడ్డారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే జనసైనికులు, వీరమహిళలు నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోకవరం మండలం మహిళా కన్వీనర్ చల్లా రాజ్యలక్ష్మి, సీనియర్ జనసైనికులు కుంచే రామకృష్ణ, ఆడారి అప్పలరాజు, భారీ సంఖ్యలో వీరమహిళలు పాల్గొన్నారు.