జగనన్న మోసం డిజిటల్ క్యాంపెయిన్.. మామిడి తోరణాలతో గుంతకల్ జనసేన నిరసన

  • జగనన్న ఇల్లు ఇల్లు లేని నిరుపేదలు.. సచివాలయాలకి మామిడి తోరణాలు

గుంతకల్: 2022 జూన్ కల్లా ఇల్లు లేని 18 లక్షల 62 వేలు నిరుపేదలకు ప్రతి లబ్ధిదారులకు ఇల్లు కట్టి మామిడి తోరణాలతో, అరటి పిలకలతో దేవుని పటంతో గృహప్రవేశం చేయిస్తానన్న ముఖ్యమంత్రి కనీసం లక్ష కూడా పూర్తి చేయలేని ముఖ్యమంత్రి సోమవారం అదే మామిడాకులతో సచివాలయాల దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు. అనంతపురం జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, సచివాలయం సిబ్బంది గారితో మాట్లాడటం జరిగింది. ఎంతమంది లబ్ధిదారులు ఇల్లు పూర్తి అయ్యింది ఎంతమంది ఇళ్లకు మామిడాకులు కట్టారు. ఇంకా ఎంతమందికి పెండింగ్లో ఉన్నాయి. మొత్తం వివరణ రేపటికల్లా ఇవ్వాలని సచివాలయం సిబ్బందితో మాట్లాడటం జరిగింది.
ఈ కార్యక్రమానికి గుంతకల్ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, కార్య నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్, మరియు వీర మహిళలు బండి చంద్రకళ, ఈరమ్మ, లక్ష్మీదేవి, పల్లవి, క్రియాశీలక సభ్యులు పామయ్య, రామకృష్ణ, మంజు, ఎం వెంకటేష్, సత్తి, చికెన్ మధు, లారెన్స్, మహేష్, రమేష్ రాజ్, మొదలగున్నవారు పాల్గొనడం జరిగింది.