జగనన్న ఇల్లు-పేదలందరికీ కన్నీళ్లు శింగనమల జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం

శింగనమల: జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్ళు #JaganannaMosam కార్యక్రమంలో భాగంగా శింగనమల నియోజకవర్గంలో ఆరు మండలాలలో జగనన్న ఇల్లు కేటాయించిన స్థలాలను సందర్శించండం జరిగింది. ఈ కాలనీలు అన్ని జనావాసాలకు దూరంగా కొండ గుట్టల్లో, వంకలలో అద్వానమైన స్థలాలు ముళ్ళ పొదలతో నిండి పోయినాయి. ఈ విధంగా జగనన్న ఇంటి పథకం ద్వారా పేద ప్రజలకు పెద్ద మోసం జరిగిందని ఈ మోసాన్ని రాష్ట్ర ప్రజలకు తెలిపే ఉద్దేశంతో మూడవ రోజూ కార్యక్రమంలో బాగంగా బుక్కరాయసముద్రం మండల కేంద్రములోనే సచివాలయం, మండల రెవన్యూ కార్యాలయం, ఎంపిడిఓ అధికారిని సంప్రదించి జగనన్న ఇళ్లు కేటాయింపు, ప్రస్తుత నిర్మాణ దశ సమాచారం ఇవ్వవలసినదిగా సింగనమల నియోజకవర్గం జనసేన పార్టీ తరపున కోరడం జరిగింది.
అధికారులు కొన్నిరోజులు వ్యవది తీసుకొని వివరాలు ఇస్తాము అని తెలిపారు.

ఎప్పటికి అప్పుడు కంప్యూటర్ లలో ఉన్న సమాసారాన్ని ఇవ్వటానికి అధికార పార్టీ నాయకులకు భయపడి నిరాసక్తత తెలుపుతున్నారు. మోసమనేది ఎన్ని రోజులు దాచిన బయటకు రాక తప్పదు. పేద ప్రజలకు జరిగిన మోసాన్ని ప్రజలకు తెలిపి అవినీతి పార్టీ నాయకుల భరతం పట్టేందుకు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, జిల్లా సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ, మండల కన్వనర్ జి. ఏర్రిస్వామి, జనసేన నాయకులు మన్నల పెద్దిరాజు, మునీంద్రా, తాహిర్, వంశీ, అవ్వరి రమేష్, భద్రంపల్లి శివ, హరిప్, షేక్ ఖాజా, కళ్యాణ్, సాయి జగదీష్, సదంఖాన్, షేక్ హర్షద్ తదితరులు పాల్గొన్నారు.