విద్యార్ధినుల సమస్యలను పరిష్కరించాలని జనసేన డిమాండ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, భైంసా విద్యార్థి సంఘాలు, బిసి సంఘాలు, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కలిసి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం పర్యవేక్షణ చేయడం జరిగింది. అక్కడ ప్రస్తుతం భాద్యతలు తీసుకొన్న జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ ని కలిసి మాట్లాడటం జరిగింది. వారు స్పందిస్తూ పాత పురుగుల బియ్యాన్ని తిరిగి ఇచ్చేశాము మంచి బియ్యాన్ని పిల్లలకు పెట్టాము, అనారోగ్యానికి గురయిన పిల్లలను హాస్పిటల్ లో చూపించి మెరుగైన వైద్యం అందించడం జరిగిందని చెప్పారు. జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, నేషనల్ బ్యాక్ వార్డ్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు, శ్రీనివాస్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా నాయకులు, షేక్ ఆంజాద్, కాంగ్రెస్ యూత్ నాయకులు, రవి, మైనార్టీ నాయకులు, జనసేన యూత్ జిల్లా నాయకులు గంగాప్రసాద్, బోల్సా గ్రామ ఉప సర్పంచ్ జవారే భీమ్ రావ్ మరియు పిల్లల తండ్రులు మాట్లాడుతూ అక్కడ మంచి నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, వాటర్ నల్లాలు, రిపేర్, బోధన సిబ్బంది టీచర్లను నియమించాలి. ముఖ్యంగా విద్యార్థులు ఆడపిల్లలు కాబట్టి వారికి కిట్లు లేక పోవడం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఇట్టి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం కాబట్టి వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల ప్రభుత్వం మెడలు వంచి పోరాటం చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మద్దతుగా ఉంటామని హెచ్చరిస్తున్నామని తెలిపారు.