చిట్టవరం గ్రామంలో జనంలోకి జనసేన

  • జనంలోకి జనసేన 2వ రోజు

నరసాపురం నియోజకవర్గం చిట్టవరం గ్రామంలో జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ ప్రతీ ఇంటికీ వెళ్లి అక్కడ ప్రజలు పడుతున్న సమస్యలు ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చిట్టవరం గ్రామ ప్రజలు ఎదర్కొంటున్న సమస్య మూడు తూములు, ఐదు తూముల గేట్లు తాత్కాలికంగా మరమ్మత్తులు చేసిన కారణంగా కొద్ది పాటి వర్షం కురవగానే ఆ తూముల్లో నీరు పంట పొలాల్లోకి వెళ్లి పొలాలు పాడయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే త్రాగు నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది, ఆ గ్రామ ప్రజలు త్రాగునీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ముఖ్యంగా ఈ సమస్యల మీద అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నాయకర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవలనాని, వాతడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మారాజు, కోపల్లి శ్రీను, తోట నాని, పైడికొండల కృష్ణ, చల్లా హేమ, పోలిశెట్టి బాబి, జిడ్డు పుల్లారావు, బొక్క నాగరాజు, కోళ్ల బాలాజీ, వింజమురి రవి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు, చిట్టవరం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.