జనసేన రైతు భరోసాయాత్ర పై టీం పిడికిలి పోస్టర్లతో ప్రచారం

పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం డౌన్ స్ట్రీట్ లో జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులు 3000 మంది చనిపోతే, అధికారంలో ఉన్నటువంటి వైస్సార్సీపీ పార్టీ గానీ ప్రతి పక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ గానీ ఏ ఒక్కరికి ఎలాంటి సహాయ సహకారాలు గానీ ఆర్ధికంగా ఆదుకోవడం గానీ చెయ్యలేదు. కానీ రెండు చోట్ల ఓడిపోయినా గానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా తగ్గకుండా నేను మీకు ఉన్నాను అంటూ తన కష్టార్జితం డబ్బులు ఒక్కో రైతుకి లక్ష రూపాయిల చొప్పున 30 కోట్ల రూపాయిలు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జనసేనకి మాత్రమే దక్కుతుంది. టీమ్ పిడికిలి పోస్టర్స్ ప్రజల వద్దకు జనసేన జానీ బృందం తీసుకు వెళ్ళడం జరిగింది. ఇలాంటి సేవకుడిని నాయుకులుగా ఎన్నుకుంటే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని జనసేన జానీ చెప్పడం జరిగింది. మరి ప్రజా సమస్యలపై జనసేన ఉద్యమాలు ఊపిరి పోసుకోవాలి జనసైనికులారా… జనసైనికుడి గొంతు ప్రజల ప్రక్షాన వినిపించాలి, జనసేన నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రభుత్వానికి సమస్యలతో ఉద్యమించిన నిరసన సెగ తెలియాలి, తెలియజేయాలి అని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గల్లీలో జనసేన జెండా రెపరెపలాడుతు ఎగరాలి అనేది జనసేన పార్టీ జనసేన నాయుకులు జనసైనికులు బాధ్యత అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడి వెంకట్ నాయుడు, కర్నెనీ సాయిపవన్, కళ్యాణ్, ప్రమోద్ దూసి ప్రణీత్, జనసైనికులు పాల్గొన్నారు.