ముదిగొండ మండల జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • జనసేన ముదిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో తల సేమియా వ్యాధి బాధితుల కోసం మెగా రక్తదాన శిబిరం

మధిర నియోజకవర్గం: తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ శ్రీ రాము తాళ్లూరి, ఆదేశాలు మేరకు శనివారం ముదిగొండ మండలంలోన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముదిగొండ మండలం, వెంకటగిరి క్రాస్ రోడ్ దగ్గర ముదిగొండ మండల నాయకులు సమక్షంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ మధిర నియోజకవర్గ నాయకులు తాళ్లూరి డేవిడ్ తో పాటుగా ముదిగొండ మండల నాయకులు మిట్టపల్లి రామారావు, ముదిగొండ మండల నాయకులు జొన్నలగడ్డ భద్ర, మీడియాతో మాట్లాడుతూ తల సేమియా బాధితులకి ప్రతి 21 రోజుకు ఒకసారి రక్తం అందని యెడల వారి ప్రాణానికి హాని ఉండిద్దని డాక్టర్లు చెబుతున్నారు.ఆ బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజేశారు. అదేవిధంగా ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మానవసేవే మాధవసేవనే దృక్పథంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు అనుగుణంగా దేశంలోని నలుమూలలా జనసైనికులు, వీరమహిళలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మధిర నియోజకవర్గంలోని ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ పోతామని, అదేవిధంగా ఈ సమాజం గురించి ఆలోచించి ప్రజల పక్షన నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడుతూ జనసేన పార్టీ ఎప్పుడు ముందుంటుందని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే 2024లో మధిర గడ్డమీద జనసేన జెండా ఎగరేయటానికి అన్ని గ్రామాల జనసైనికులు అందరూ సిద్ధంగా ఉన్నారని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తల సేమియా బాధితుల కోసం రక్తం ఇచ్చిన ప్రాణదాతలకి జనసేన పార్టీ మధిర నియోజక వర్గం తరుపున ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం జనసేన విద్యార్థి నాయకులు గంధం ఆనంద్, జనసేన పార్టీ సోషల్ మీడియా నాయకులు సజ్జనపు భరత్,
చింతకాని మండల నాయకులు వినోద్ ఎర్రుపాలెం మండల నాయకులు షేక్ నాగుల్ మీరా, ముదిగొండ మండల నాయకులు సంతోష్, అజయ్, శేషు, నరేష్, నాగరాజు, వెంకటేష్, వరుణ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.