బీసీల అభ్యున్నతికి జనసేన సహకారం ఇస్తుంది

  • బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది
  • బీసీ కుల జనగణ రౌండ్ టేబుల్ సమావేశంలో గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె: రాష్ట్రంలో బిసి కుల జన గణనను పారదర్శకంగా చేపట్టి, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కులను కల్పించాలని బీసీ కుల జనగణన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ పునరుద్ఘాటించారు. ఆదివారం మదనపల్లె టౌన్ బెంగళూరు రోడ్డు, నక్కలదిన్నె షటిల్ కోర్టులో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బిసి కుల జనగణన అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఆద్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తమ హక్కుల సాధన కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు. అడవులలో జంతువులకు గణాంకాలు ఉన్నాయని, కాని దేశ వ్యాప్తంగా బిసిల కుల జనగణన లేకపోవడం అన్యాయమన్నారు. రాయలసీమ జిల్లాలలో 32 నియోజకవర్గాలలో వాల్మీకుల ప్రభావం వుందని, నీలం సంజీవరెడ్డి కంటే ముందు వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారన్నారు. రాజకీయంగా వారిని అణగదొక్కడానికి‌ బిసిలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి రిజర్వేషన్ల అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మద్దతునిస్తామన్నారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ బిసి కుల జనగణనను స్వాగతిస్తున్నామని, అయినా ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తుందనే నమ్మకం లేదన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బిసి కుల జన గణన పారదర్శకంగా జరపాలన్నారు. వైసిపి ప్రభుత్వం నిజంగా బిసి కుల జనగణన చేయాలని భావిస్తే పారదర్శకంగా చేపట్టాలన్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్నికల కోసమే బిసి కుల జనగణన చేపట్టడం జరిగిందే తప్ప బిసిలకు అండగా నిలబడడానికి కాదని విమర్శించారు. అడపా సురేంద్ర, నాయుని జగదీష్ బిసి కుల జనగణనపై తమ సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జల రెడ్డెప్ప, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, చంద్రశేఖర, గడ్డం లక్ష్మిపతి, జవిలి మోహన్ కృష్ణ, నవాజ్, కుమార్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.