నరవ గ్రామప్రజలకు ప్రభుత్వాసుపత్రి కోసం జనసేన డిమాండ్

పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామం మరియు పరిసర గ్రామాలలో సుమారు 40 వేల మంది ప్రజలు నివసిస్తున్నారని, వీరికి అందుబాటులో 24/7 ప్రభుత్వ హాస్పటల్ లేకపోవడం వలన మెరుగైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని GVMC కమిషనర్ Dr. G. లక్ష్మీసా దృష్టికి స్థానిక జనసేన పార్టీ నాయకులు శ్రీ వబ్బిన జనార్ధన శ్రీకాంత్, శ్రీ గండ్రేడ్డి అశోక్ కుమార్ మరియు GVMC ఫ్లోర్ లీడర్ శ్రీ వసంత లక్ష్మి గోపికృష్ణ తీసుకొని వెళ్ళడం జరిగింది. స్థానికంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉందని, కానీ అక్కడ ఉన్న సదుపాయాలు ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సదుపాయాలు లేవని, అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రజలకు మరుగైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, 10 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు GVMC వారు పెట్టదలిచారు కానీ ప్రస్తుత PHC వద్ద మీకు కావలసిన ప్రభుత్వ భూమి లేనందున వెనుకడుగు వేస్తున్నారని, మా యొక్క గ్రామంలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటుకు సరైన ప్రభుత్వ భూమిని ఎన్నుకొని 10 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయాలని తెలియజేయడం జరిగింది. కమిషనర్ బదులిస్తూ తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి మీ ప్రాంతంలో 10 పడకల హాస్పిటల్ ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని వివరణ ఇవ్వడం జరిగింది.