ప్రభుత్వ హాస్పిటల్ నందు త్రాగునీటి సదుపాయం కల్పించాలని జనసేన డిమాండ్

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి, ప్రభుత్వ హాస్పిటల్ నందు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు నీళ్ళు కూడా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు మన ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి వర్యులు నిద్రావస్థలో ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రతి ఏటా కోట్లల్లో పేదల వైద్య సేవల కోసం ఖర్చు చేసాము, అత్యవసర సేవలను ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రజలకు అందుబాటులోకి తెస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. కనీసం కదిరి పట్టణంలో ఉన్న సర్వజన ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే రోగులకు మంచి నీటి సదుపాయం కూడా కల్పించ లేకపోతోంది ఈ ప్రభుత్వం.ఇక స్థానిక ఎమ్మెల్యే ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా ప్రభుత్వ హాస్పటల్ లో వైద్యుల నిర్లక్ష్యం, వసతుల కొరత పట్ల దృష్టి సాధించలేక పోతున్నారు. ప్రభుత్వం వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో వచ్చే నిరుపేదలకు హాస్పిటల్ నందు మంచి నీటి వసతి కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఉందా అని స్థానిక ప్రజలు సైతం ప్రభుత్వం, వైద్య అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కి వైద్యం కోసం వస్తారు వేల రూపాయల డబ్బులు చెల్లించి వైద్యం చేపించుకొలేని రోగులు. ఇంటింటికీ మంచి నీరు అందిస్తామన్నారు స్థానిక ఎమ్మెల్యే పెడబల్లి వెంకటసిద్దారెడ్డి గారు కనీసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికైనా మంచినీటి సౌకర్యం కల్పించండి చాలు. రాజకీయ నాయకులు అధికారంలోకి రాకముందు ప్రజలకు నోటికి వచ్చిన హామీలు ఇస్తారు గెలిచిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టి వారి స్వలాభం కోసం మాత్రమే పని చేయడం వల్లనే భారత దేశం ఇప్పటికీ అభివృద్ది చెందుతున్న దేశం గానే మిగిలిపోతోంది. దీనికి కారణం ప్రజలు కూడా మీ అమూల్యమైన ఓటును నోటుకు అమ్ముకోవడం వల్లనే. సత్వరమే అధికారులు స్పందించి ప్రభుత్వ హాస్పిటల్ నందు త్రాగునీటి సదుపాయం కల్పించాలని కదిరి జనసేన పార్టీ తరపున అధికారులను కోరుతున్నామని కదిరి జనసేన పార్టీ, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల డిమాండ్ చేసారు.