స్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని జనసేన డిమాండ్

ఆత్మకూరు, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ సూచనతో, ఆత్మకూరు నియోజవర్గ జనసేన పార్టీ ఉప ఇంచార్జ్ దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలలోని దువ్వూరు గ్రామానికి చెందిన స్మశాన వాటిక కోతకు గురి కావడం కారణంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికుల తో కలిసి స్మశానవాటికను సందర్శించడం జరిగింది. విషయంలోకి వెళితే “సర్వే నెంబర్-387″లో 1.5 సెంట్లు ప్రభుత్వ రికార్డుల ప్రకారం స్మశాన వాటిక భూమి ఉండాలి అంటే ప్రస్తుతం స్మశానవాటిక భూమి 70 నుంచి 80 సెంట్లు మాత్రమే ఉన్నది. అంటే దాదాపు 25 నుంచి 35 సెంట్లు స్మశాన వాటిక భూమి కోతకు గురి కావడం జరిగినది. కోతకు గురైన స్మశానవాటిక భూమిని అధికారులు గుర్తించి స్మశాన వాటికను సర్వే చేసి చుట్టూ ప్రహరీ నిర్మించాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేయటం జరిగింది. లేనిపక్షంలో పోరాటం చేయడానికి సిద్ధంగా జనసేన పార్టీ ఉందని ఈ సందర్భంగా నాయకులు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంఘం మండల నాయకులు కమతం ప్రవీణ్, సంఘం మండల నాయకులు ఘంటసాల తిరుమలేష్, సాయి, మల్లికార్జున్, నాని, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.