ఏలూరు నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై జనసేన పోరుబాట 5వరోజు

ఏలూరు నియోజకవర్గం, స్థానిక 13వ డివిజన్ మరడాని రంగారావు కాలనీలో ప్రజాసమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా.. పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి.. అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు గత నాలుగేళ్లుగా సరైన రోడ్డు డ్రైనేజీ నిర్మాణాలు లేక ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.. జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాలనీలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరిస్తారని రెడ్డి అప్పలనాయుడు భరోసా ఇచ్చారు. మురుగు డ్రైన్ నిర్మాణం చేయకుండా ఉండడం వలన అనేక మంది పిల్లలు ఈ మురుగు డ్రైన్లో పడిపోవడం వంటి సమస్యలకు గురిఅవుతున్నారని అధికారులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, సంయుక్త కార్యదర్శి ఓబులిశెట్టి శ్రవణ్, నగర అధ్యక్షులు కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణ రావు, ధర్మేంద్ర, దోశపర్తి రాజు, వేగి సత్యనారాయణ, అన్నవరం, తోట రవి, రాజేష్, సత్యనారాయణ, మజ్జి హేమంత్, మజ్జి శ్రీను, బొండా రాము, నిమ్మల శ్రీను, కీర్తి కృష్ణ, పూర్ణ, రమణ, చందు, పవన్, రమేష్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.