శ్రీరంగ రాయలచెరువు నీరు కలుషితం పై ఎమ్మార్వోకి వినతిపత్రం

సింగనమల నియోజవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సింగనమల మండల కేంద్రంలోని శ్రీరంగ రాయలచెరువు నీరు కలుషితమై చేపలు చనిపోతున్న అందువలన అలాగే పంట పొలాలకు ఇబ్బంది కలుగుతుందేమో అని సింగనమల తాసిల్దార్ కి వినతిపత్రం ఇవ్వడానికి వెల్లగా ఆయన ఆధారాలు కోరారు, మేము కూడా కచ్చితంగా కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తుందో వీడియోలు ఫోటోలు రూపంలో ఆయనకు ఒక వారం రోజుల లోపల సమర్పిస్తాము దానికి ఆయన ఏమి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి అలాగే ఎమ్మార్వో ఒక పార్టీ ప్రతినిధులమైన మమ్మల్ని బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నాడు అంటే ఆయన సామాన్య ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఆయనకు వినతిపత్రం ఇవ్వాలంటే ప్రజా ప్రతినిధులు మాత్రమే ఇవ్వాలంట తెల్ల కాగితంలో మెమోరాండం ఇస్తే దానికి సాక్ష్యాధారాలు కూడా జతచేసి ఇవ్వాలంట. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తమ రెడ్డి. జనసేన పార్టీ సింగనమల నాయకులు బి.సాయి శంకర్, మోహన్ రాయల్, రవి కల్లుమడి, రామంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.