యువతి వివాహానికి జనసేన ఆర్ధికసాయం

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు ఆదేశాల మేరకు 18 వ తేదీన సాయంత్రం 5 గంటలకు అర్ధవీడు మండలము అర్ధవీడు గ్రామంలో డేరంగుల శ్రీనివాసులు శ్రీమతి నాగమ్మ కూతురు వెంకట లక్ష్మీ వివాహ నిమిత్తం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య చేతుల మీదుగా ₹5000 రూపాయలు, 100 కేజీల బియ్యం సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, అర్ధవీడు మండల అధ్యక్షులు కలగొట్ల అల్లురయ్య నాయకులు షేక్ జాకీర్, బిర్రే శేషాద్రి నాయుడు, తోట కేశవ, అంబటి దాసుబాబు, కోంకాల రంగస్వామి, సయ్యద్ దౌలత్, పిక్కిలి మస్తాన్, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.