దామెర రాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

వరంగల్, నర్సంపేట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపధ్ పథకం ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో జరిగిన కాల్పుల ఘటనలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గఒ ఖానాపూర్ మండలం ధబీర్ పేట గ్రామానికి చెందిన యువకుడు దామెర రాకేష్ మరణించడం జరిగింది. మృతి చెందిన యువకుడు రాకేష్ అన్నయ్య జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త దామెర రామ్ రాజ్ అవడం బాధాకరం మరియు దురదృష్టకరం. ఈ సంఘటన పైన స్పందించిన తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ ఆకుల సుమన్ నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ ని వివరాలు అడిగి మృతుడి సోదరుడు రామ్ రాజ్ తో ఫోన్ లో మాట్లడి వారికి అండగా ఉంటామని ధైర్ఘ్యం చెప్పటం జరిగింది. అలాగే రాష్ట్ర ఇన్చార్జ్ మరియు జిల్లా ఇంచార్జీల సూచనల మేరకు నియోజకవర్గ నాయకుడు మేరుగు శివ కోటీ యాదవ్ మరియు జనసైనికులు బాధితుని కుటుంబాన్ని పరామర్శించి వారికి ఏ ఆపద ఉన్న జనసేన పార్టీ తరఫున అండగా ఉంటాము అని దైర్యం చెప్పడం జరిగింది. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి ఏమీ అనగా మరియు వారి వాదన ఏమి అనగా……ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందించాలని లక్ష్యంతో నిరసన తెలిపటానికి వెళ్లిన మా చిన్న కుమారుడు రాకేష్ పై ఎవరు ఎందుకు కాల్పులు జరుపవలసిన అవసరం ఏమీ వచ్చింది అని, దీని పైన విచారణ జరిపి దీనికి కారకులు ఎవరో తెలిపి వారిపై చర్యలు తీసుకొని, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కుటుంబానికి అండగా నిలిచే విధంగా అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ వచ్చి బాధిత కుటుంబానికి హామీ ఇవ్వాలని లేదు అంటే వారి కుమారుడి మృత దేహాన్ని తీసుకోవడానికి న్యాయం జరిగే వరకు నిరాకరిస్తామని నియోజకవర్గ నాయకుడు శివకోటీ యాదవ్ తో కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఆదుకోవాలని తెలపడం జరిగింది. ఈ వార్త విన్న వెంటనే మృతుడి తల్లి స్పృహ తప్పి పడిపోయి వైద్యానికి నిరాకరించడం బాధాకరం. పరామర్శించడానికి వెళ్లిన వారిలో నర్సంపేట యువ నాయకులు వంగ మధు, ఒర్సు రాజేందర్, అందె రంజిత్, నీలం నాగరాజులు ఉన్నారు.