అగ్నికుల క్షత్రియులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన జనసేన నాయకులు

రాజోలు, అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో నది తీరం వెంబడి గ్రామాల్లోని ఇళ్ళు గోదావరి నదిలో కలిపోతున్నాయి అని అక్కడ నివసిస్తున్న అగ్నికుల క్షత్రియులు గ్రామాలను వదిలి వేరే గ్రామాలకు తరలి వెళ్లి పోవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతూ మా గ్రామాలను మా గృహాలను ఈ గోదావరి కోత నుండి కాపాడే విధంగా రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. దానికి జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు పర్యటించి బాధితులతో మాట్లాడి ఆ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రక్షణ గోడ నిర్మాణానికి మీకు తోడుగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ, జిల్లా కార్యదర్శి గుండాబత్తుల తాతాజీ, నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు, గొల్లమందల పూర్ణ భాస్కరరావు, మల్కిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, ఉండపల్లి అంజి, ఎంపీటీసీ బైరా నాగరాజు, మాలే కాళిదాసు, సాధనాల విజయ్, అన్నంనీడి రాజేష్, ఓగూరి మనోహర్, దంగేటి బాబి, జిల్లెల్ల నరసింహారావు, బెల్లంకొండ పుత్రయ్య, చింతా రాజు, ఎనుముల నారాయణ ప్రసాద్, చింతా స్వామి, దుర్గాప్రసాద్, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో ఆగ్నికుల క్షత్రియులు పాల్గొన్నారు.