ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో జనసేన భోజన ఏర్పాట్లు

బనగానపల్లె పట్టణంలోని ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు హాజర్ చంద్రశేఖర్ మరియు సామాన్య కుటుంబంలో పుట్టి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు జడ్జిగా కేంద్రమంత్రిగా గవర్నర్గా పనిచేసిన పుంజాల శివ శంకర్ వర్ధంతి సందర్భంగా ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ నాయకులు భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని బావరా గ్రామంలో జగరాణిదేవి, సీతారాం తివారీల అనే బ్రాహ్మణ దంపతులకు చంద్రశేఖర్ తివారీ జన్మించాడని ఆయనే చంద్రశేఖర్ అజాద్ గా మారి 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్ర సమర యజ్ఞంలో ఆహుతయ్యేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైన ఆజాద్ గా 15 ఏళ్లు కూడా నిండని అతి పిన్న వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం సర్వ సమర్పణకు సంసిద్ధమైన వ్యక్తి చంద్రశేఖర్ అజాద్ అని అన్నారు. అలాగే సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఆర్థిక ఇబ్బందులతో పంజాబ్ వెళ్లి అక్కడ పని చేసుకుంటూ చదువు పూర్తి చేసి రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు జడ్జిగా సిక్కిం కేరళ రాష్ట్రాలకు గవర్నర్ గా సుప్రీంకోర్టు న్యాయవాదిగా మాజీ కేంద్ర మంత్రిగా ఎన్నో విశిష్ట సేవలు అందించారని అలాంటి వారిని ఈరోజు స్మరించుకుంటూ ప్రదర్శన వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాశీం, అజిత్ రెడ్డి, అల్లా బక్ష్, కార్యకర్తలు జనార్ధన్, విక్రమ్, సుధాకర్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.