Darsi: దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్రచారం

ప్రకాశం జిల్లా, దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ 2వ వార్డ్ నుండి ప్రచారం ప్రారంభించారు. జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు దర్శి నియోజకవర్గ ఇన్చార్జి బొటుకు రమేష్ బలపరిచిన 2వ వార్డ్ జనసేన పార్టీ అభ్యర్థి చాతి రాశి నరసయ్య తరపున ప్రచారంలో పాల్గొన్ని అనంతరం 17వ వార్డు లో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జులు జనసేన జిల్లా కమిటీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.