9వ తేదీన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఈ నెల 9వ తేదీన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం జరుగుతుంది. ఉదయం 11గం.కు సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలను చర్చిస్తారు. జనసేన పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మండల అధ్యక్షులను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, పి.ఏ.సి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు పాల్గొంటారు.