స్థలం కోల్పోయిన బాధితుడికి స్థలం ఇప్పించిన జనసేన పార్టీ

విశాఖ జిల్లా పాడేరు హుకుంపేట మండలం మర్రిపుట్టు గ్రామానికి సంబందించినటువంటి పాడేరు జనసేన పార్టీ జనసైనికుడు చుంచు రాజు తండ్రి చుంచు కొండబాబుకి 1997లో అప్పుడు గవర్నమెంట్ హయాంలో స్టలం మంజూరు అయింది. చుంచు కొండబాబు 20 సంవత్సరాల నుండి స్థలంలో జీవనం కొనసాగిస్తున్నారు. కొండబాబు సోదరుడు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అమ్మేసాను అని చెప్పడంతో కొండబాబు జీవనం అయినటువంటి పశువులు కట్టుకోడానికి భూమి లేక కొండబాబు పాడేరు జనసేన పార్టీని ఆశ్రయించారు మాకు న్యాయం జరగడం లేదు అని వివరించారు. విషయం తెలుసుకుని హుకుంపేట మండలం తహసిల్డర్ కార్యాలయంకి వెళ్లి, డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్ బాధితులకు తగిన న్యాయం చేయమని పెద్దాయన తిరగలేరు ఆయన జీవనాధారం అయిన పశువులు కట్టుకోడానికి స్థలం కేటాయించి ఆయన జీవన విధానానికి అండగా ఉండాలని జనసేనపార్టీ ద్వారా కోరడం జరిగింది. డిప్యూటీ తహసిల్దార్ వెంటనే స్పందించి 2 సెంట్లు భూమి గవర్నమెంట్ స్థలంలో కేటాయిస్తామని హామీ ఇచ్చి బాధితులకు న్యాయం చేస్తానని డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్ తెలపటం జరిగింది. చుంచు కొండబాబుకి ధైర్యం చెప్పి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు డిప్యూటీ తహసిల్దార్ భాస్కర్. బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటాదని పాడేరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళి క్రిష్ణ, G.మాడుగుల మండల జనసేన పార్టీనాయకులు మాసాడి సింహాచలం, Ex ఎంపీటీసీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు అనిల్ కుమార్, పాడేరు నాయకులు రాజు బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.