తెర్లం, పినపింకీ రోడ్ల దుస్థితిపై జనసేన నిరసన

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి నుంచి తెర్లం వెళ్లే రోడ్డు, పినపింకీ నుంచి ఆకులకట్ట రోడ్డు అధ్వానంగా ఉండడంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోడ్లను బాగుచేయాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ బొబ్బిలి మండలం పారాది బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో అన్ని వాహనాలతో పాటు భారీ వాహనాలను కూడా ఆకులకట్ట రోడ్డు గుండా తెర్లాం రోడ్డుకు దారి మల్లించడంతో ఇదివరకు అక్కడక్కడ గుంతలతో వున్న రోడ్డు, ఇపుడు భారీ గుంతలు గోతులో అద్వాన్న స్థితి ఏర్పడడంతో, ప్రజలు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన గుంతలకు నాణ్యతతో కూడిన మరమ్మత్తులు చేయాలని, కారాడ గ్రామంలో ప్రతి సంవత్సరం రోడ్లు కుంగిపోతున్నాయని, దానికి పదవులు అనుభవిస్తున్న అధికార పార్టీ నాయకులు, బాధ్యత తీసుకొని సీసీ రోడ్డు వేసి శాస్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, తెర్లం మండల అధ్యక్షలు మరడాన రవి, సీనియర్ నాయకులు పొట్నూరు జనార్ధన, గేదెల శివ, ఎందువా సత్యన్నారాయణ, పళ్లెం రాజా, అలజంగి కారాడ జనసైనికులు, కారాడ ప్రజలు పాల్గొన్నారు.