రైతులకు గిట్టుబాటు ధర కాదు లాభసాటి ధర కావాలి నినాదంతో జనసేన ప్రచార పోస్టర్లు విడుదల

నంద్యాల జిల్లా, బనగానపల్లె పట్టణంలో జనసేన పార్టీ నాయకుడు భాస్కర్ ఆధ్వర్యంలో యాగంటి బసవేశ్వర రైతు సంఘం అధ్యక్షుడు మూలారెడ్డి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ప్రచార పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. రైతు సంఘం అధ్యక్షుడు మూలారెడ్డి మాట్లాడుతూ కౌలు రైతులకు పవన్కళ్యాణ్ అండగా నిలబడటం చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం హర్షించదగ్గ విషయమని రైతుల బాగు కోరే వ్యక్తులు ఎప్పటికైనా విజయం సాధిస్తారని అన్నారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ టీం పిడికిలి సంస్థ ఎన్నారై జనసేన నాయకులు రాజా మైలవరపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రచార పత్రికలు అన్ని నియోజకవర్గాలకు పంపడం జరిగిందని వాటిని శుక్రవారం విడుదల చేయడం జరిగిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను తన సొంత కష్టార్జితంతో కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాడని ప్రభుత్వం చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ సహాయం అందని కౌలు రైతు కుటుంబాలను చూపించాలి అనడం హాస్యాస్పదంగా ఉందని ఇప్పటికే అనంతపురం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలో బహిరంగ సభ ద్వారా సహాయం చేసిన రైతులు కౌలు రైతులు కాదా అని ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా పవన్ కళ్యాణ్ సహాయం చేసిన కౌలు రైతు కుటుంబాలు కాదని నిరూపించగలరా అని అన్నారు. జనసేన నాయకులు గుర్రప్ప, పృద్వి, పెద్దయ్య, అజిత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కావాల్సింది దొరకదు లాభసాటి ధర అని రాజకీయ పార్టీలు ఎన్నాళ్లు రైతులకు గిట్టుబాటు ధర కావాలని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని రైతులు లాభసాటి వ్యవసాయం చేసినప్పుడే రైతు ముఖంలో సంతోషం కనబడుతుందని రాష్ట్రంలోని ఎన్నో ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ రైతులకు అండగా నిలబడతాం నాయకుడు పవన్ కళ్యాణ్ అని రాష్ట్రంలోని యువతతో పాటు రైతులు బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ అధికారం చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార కమిటీ రాష్ట్ర సభ్యులు భాస్కర్ రావు, జనసైనికులు రామకోటి, సుధాకర్, శీను, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.