సత్తెనపల్లిలో జనసేన – తెలుగుదేశం సంకల్ప పాదయాత్ర

సత్తెనపల్లి, ప్రజల పక్షాన ప్రజా క్షేమానికై నిలబడుతూ అమరావతి రాజధాని ద్యేయంగా, యువతకు ఉపాధి కల్పనే ఆశయంగా, సత్తెనపల్లి అభివృద్ధియే ఆకాంక్షగా అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆయాలకు అనుగుణంగా, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మంగళవారం నందిగామ గ్రామము నుంచి మొదలైన పాదయాత్ర కంటెపూడి, కట్టవారిపాలెం మీదుగా ప్రజలకు భరోసా ఇస్తూ కోమెరపూడి గ్రామంలో పాదయాత్రను పూర్తి చేసుకొని 15.5 కిలోమీటర్ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి కొమెరిపూడి గ్రామంలో బొర్రా అప్పారావు బస చేయడం జరిగింది. సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామం నుండి బుధవారం జనసేన – తెలుగుదేశం సంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించి అమరుడైనక స్వరాజ్యం సాధించుకున్నామన్నారు. పొట్టి శ్రీరాములు కలలు కన్న స్వరాజ్యం రావాలంటే అభివృద్ధి జరగాలన్నారు. యువకులంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు తరలిపోయారని, గ్రామాలు వృద్ధులతో వృద్ధాంద్రప్రదేశ్ గా మిగిలిపోయిందన్నారు. రాజధాని ఏది అంటే పేరు చెప్పుకోలేని పరిస్థితి దాపురించింది ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, అభివృద్ధి, ఉద్యోగాలు వచ్చినప్పుడు నిజమైన రాష్ట్రం వచ్చినట్లు అన్నారు. చదువుకున్న యువకులకు ఇక్కడే ఉద్యోగాలు వస్తే గ్రామాల్లో నివసిస్తారని, మన ప్రజలు సుఖశాంతులతో ఉన్నప్పుడే నిజమైన ఆంధ్రరాష్ట్రము ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వాలను ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నమన్నరు. బుధవారం పాదయాత్ర కోమెరపుడి వద్దకు చేరుకుంది. గురువారం ఉదయం కోమరిపూడి నుండి పాదయాత్ర జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, జనసేన సత్తెనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు బత్తుల కేశవ, ఏడో వార్డ్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, చిలక పూర్ణ, చిలక సత్యం, ఖాసీం, షేక్ రఫీ, టిడిపి సత్తెనపల్లి మండల అధ్యక్షుడు ఆళ్ల అమరేశ్వరావు తదితర జనసేన- టడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరజీవికి నివాళులర్పించిన బొర్రా

  • ప్రజలంతా నిత్య చైతన్యమూర్తులై పోరాడాలి

సత్తెనపల్లి, బుధవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని నందిగం గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బొర్రా అప్పారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అనగానే మన మదిలో స్ఫురణకు వచ్చే మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం ఆ పుణ్యమూర్తి ప్రాణార్పణతో ఏర్పడిన మన ఆంధ్రప్రదేశ్ ‘రాష్ట్ర అవతరణ దినోత్సవం’ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ నా తరపున, జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలని, ఆనాటి కాలమాన పరిస్థితులలో తెలుగువారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే మద్రాస్ ప్రెసిడెన్సీలో పరిగణించేవారు. ఈ వివక్షను భరించలేక శ్రీ పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, తెలుగువారిలో చైతన్యం తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిపెట్టారు. ఆంధ్రులలో ఎటువంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో ఆ చైతన్యం ఆంధ్రప్రదేశ్ వాసులలో ఈనాడు ఏమైంది?. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ఎందుకు స్పందన కరవైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా, ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ప్రశ్నించారు? ఆంధ్రప్రదేశ్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో ఒక్కసారి మననం చేసుకోవలసిందిగా ప్రజలకు మనవి చేస్తున్నాను. అక్రమార్కులు పాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందాం, ఈ పర్వదినాన బాధ్యతాయుతమైన పౌరులందరూ ఆలోచన జరపాలి, ఆంధ్రప్రదేశ్ శాంతిసౌభాగ్యాలతో విరాజిల్లేలా కార్యాచరణతో ముందుకు సాగాలి. గళమెత్తాలి, ఓటును ఆయుధంగా మలచాలి, ఆంధ్రప్రదేశ్ ను మనదేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలపాలి, ఆనాడే త్యాగధనుల త్యాగాలకు సార్ధకత, ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణభూతులైన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికీ, ఈ యజ్ఞం కోసం కృషి చేసిన మహానుభావులందరికీ ఈ పర్వదినాన నివాళులర్పిస్తున్నానని అన్నారు.

పెద్దమక్కేన గ్రామంలో బాబుతో మేము

సత్తెనపల్లి, సత్తెనపల్లి మండలం పెద్దమక్కేన గ్రామంలో నిర్వహించిన బాబుతో మేము కార్యక్రమంలో సత్తనపల్లి తెలుగుదేశం ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మరియు తెలుగుదేశం నాయకులతో కలిసి జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొనడం జరిగింది. సత్తెనపల్లి రూరల్ మండలం అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, సత్తనపల్లి ఏడవ వార్డ్ కౌన్సిలర్, నకరికల్లు మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, జనసైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.