తంబళ్లపల్లెలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తంబళ్లపల్లె నియోజకవర్గం 5 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బి.కొత్తకోటలో పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ సైలని షాకీర్ భాష మండల కన్వీనర్ రామాంజులు ప్రధాన కార్యదర్శి ఖలీల్ గని రాయల్ వినోద్ అధ్వారంలో పెద్ద ఎత్తున బాణాసంచా బళ్లారి డ్రమ్స్ తో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి అందరికీ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకీ మహేంద్ర రాయల్ రమేషా ప్రశాంత్ భరత్ లక్ష్మీనారాయణ నటరాజ సూరి బాల రామాంజులు ముని శేఖర్ సుధాకర్ జి శంకర్ బాలసుబ్రమణ్యం నాగరాజు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.

*ములకలచేరువులో ఘనంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ములకలచేరువు మండలంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు కలసి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 51వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. జనసైనికులు మెగా పవర్ స్టార్ అభిమానులు బస్టాండ్ సర్కిల్ లో మొగరాలలో భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ములకచేరువు మండల కన్వీనర్ పోతుల సాయినాథ్ మాట్లాడుతూ 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసే విధంగా పార్టీని ముందుకు తీసువెళ్లాలని తెలిపారు. అనంతరం అందరూ కలసి హైస్కూల్ నుండి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ డెరైక్టర్ సాయి సురేష్, జనసేన నాయకులు జెసిబి సీన, గోపి, షోరూం సూరి, అనిల్, కిరణ్, సుబ్బు, లక్ష్మీపతి, రెడ్డి సురేష్, మధు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్ద మండ్యం మండలం అధ్యక్షులు శంకర ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. పిటిఎం జనసేన పార్టీ మండలము అధ్యక్షులు శంకర ఆధ్వర్యంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.