ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికే జీవో నెంబర్ 16

  • జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికే జీవో నెంబర్ 16 అమలులోనికి తేవడం జరిగిందని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. శుక్రవారం అప్పలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తు ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అరెస్టు చేయాలని జీవో నెంబర్ 16ని వినియోగిస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా ప్రశ్నించకూడదు. ఏ అరాచకం చేసిన కూడా సైలెంట్ గా ఉండటమే. పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వారిని భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ తో ఈ ఘోరమైనటువంటి జీవో ని తీసుకొచ్చారు. ఆయనను అరెస్టు చేయాలి, ఆయన మీద కేసులు పెట్టాలి అన్నటువంటి ఆలోచనతో తద్వారా ఆయన బెదిరించాలని ఎవరూ కూడా ప్రశ్నించకూడదని జీవో నెంబర్ 16ను తీసుకురావడం ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. దానినిమేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉందో ఈ వ్యవస్థని వారి యొక్క జేబులో పెట్టుకొని వారి ద్వారా ఈ సమాచారం గోప్యంగా తీసుకొచ్చి అది ఎక్కడ పెడుతున్నారు అని ప్రశ్నించినందుకు ఈ యొక్క జీవో నెంబర్ 16, ఈ రకంగా చూస్తే శుక్రవారం మన ఏలూరు శనివారపుపేట నుండి ఒకరు లెటర్ పంపించారు. వాలంటీర్లు ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారనేది ఒక లెటర్ పంపించింది ఒక మహిళ. దీన్ని బట్టి ఎక్కడికి పోతుంది ఈ సమాజం. అంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించి వారికి ఎక్కడా కూడా స్వేచ్చ లేకుండా భంగం కలిగించినటువంటి ఈ ప్రభుత్వం. ఇప్పటివరకు గడిచిన నాలుగు సంవత్సరాలలో విధ్వంసాలు తప్పించి ఎక్కడా కొట్టుకోవడం, చంపకపోవడం కేసులు పెట్టడం, ఏదైనా ప్రక్రియ మీద విధ్వంసం చేసి కేసులు పెట్టడం ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. జులై 9వ తారీఖున ఏలూరు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యల లేవనెత్తారు కాదు నివేది గురించి మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ నీ తప్పుదారి పట్టించి ప్రజల యొక్క డేటా గోప్యతను మీరు వైసీపీ నాయకులకి ఇస్తున్నారని దానిమీద మాట్లాడారు.. అనేక సమస్యల మీద మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే గాని ఏ నాయకుల్ని గాని పేరు పెట్టి వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. కానీ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రెస్ మీట్ పెట్టి ఆయన అడిగిందేంటి ??. ఇన్ని సంవత్సరాలైనా ఏలూరు గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయలేకపోయినటువంటి అసమర్థులు మీరు. ఈ సమస్యలన్నింటిమీద మాట్లాడకుండా ఉండేందుకు జీవో నెంబర్ వన్ తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్లు పెట్టకూడదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం ప్రజల గొంతుని ప్రతిపక్ష పార్టీలు గొంతుని నొక్కాలి. అటువంటి ఆలోచనతో జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు. దానిని తీవ్రంగా హైకోర్టు ఖండించి కొట్టివేసింది. జీవో నెంబర్ 16 తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయాలని, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తే మన ఉనికిని కోల్పోతాం, మన పదవులు కోల్పోతామని, మనం చేసే దోపిడీకి ఈ పవన్ కళ్యాణ్ అడ్డు వస్తున్నాడు అని అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగోలాగ బెదిరించాలి, అరెస్టు చేయాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దానిని నిర్వీర్యం చేయాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, సీనియర్ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, టౌన్ సెక్రటరీ సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కోఆర్డినటర్ చిత్తిరి శివ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోస పర్తి రాజు, పైడి లక్ష్మణరావు, బోండా రాము నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.