స్థానికులకే ఎక్కువ ఉద్యోగఅవకాశాలు: కేసిఆర్ ప్రభుత్వనిర్ణయం

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం రాత్రి సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించేలా నూతన విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ ఐపాస్ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేలా విధానం రూపొందించాలని పరిశ్రమల శాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ముసాయిదాను పరిశ్రమల శాఖ రూపొందించింది. దీనిలో బాగంగా 50-80 శాతం వరకు స్థానికులకే ఉద్యోగాలు కేటాయించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.