శ్రీశ్రీశ్రీ వేగులమ్మ జాతర మహోత్సవ కార్యక్రమానికి హాజరైన జ్యోతుల

పిఠాపురం: దుర్గాడ శ్రీ శ్రీ శ్రీ వేగులమ్మ గ్రామ దేవత) అమ్మవారి జాతర మహోత్సవలలో భాగంగా శనివారం స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ కోధి నామ సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి నుండి శ్రీ శ్రీ శ్రీ వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు హాజరై ముందుగా శ్రీ వేగులమ్మ వారిని దర్శించుకుని, అనంతరం శ్రీ వేగులమ్మ వారి జాతర మహోత్సవ ఏర్పాట్లు గురించి ఆలయకమిటీ వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ దుర్గాడ గ్రామ దేవత అయిన శ్రీ వేగులమ్మవారు చాలా పేరు, ప్రతిష్టలు కల్గి, మహిమలు గల గ్రామదేవతని, గ్రామదేవత వద్దకు వచ్చి అనేకమంది భక్తులు తమ యొక్క మొక్కులు తీర్చుకొని, కోర్కెలు కొరుకొంటారు. కాబట్టి వేగులమ్మవారు జాతర మహోత్సవాలలో ఆలయకమిటీ వారికి ప్రజలు, భక్తులు సహకరించాలని దుర్గాడ గ్రామ ప్రజలను, భక్తులను జ్యోతుల శ్రీనివాసు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వేగులమ్మ (గ్రామదేవత) కమిటి సభ్యులు, జాతర మహోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.