ఆక్రమ మట్టి, గ్రావెల తవ్వకాల అడ్డగింత ఉద్యమానికి మద్దతు ప్రకటించిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో గత రెండు సంవత్సరాల నుంచి కోదండరాముని చెరువులో భారీ స్థాయిలో మట్టి, గ్రావెల్ తవ్వకాలను నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయిలో కోదండరాముని చెరువు నందు భారీ గోయ్యిలు, బంటాలు పెట్టి మట్టిని, గ్రావెలను అక్రమంగా తరలించుపోతున్న అక్రమ తవ్వకందారులను 2023 జూన్ 30వ తేదీ శుక్రవారం నుంచి జనసేన నాయకులు అరవ వెంకటాద్రినాయుడు, జనసేన గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లిరామకృష్ణ, తాటిపర్తి జనసేనసీనియర్ నాయకులు గారపాటి చంటిబాబు తాటిపర్తి గ్రామజనసైనికుల ఆధ్వర్యంలో ఇతరగ్రామాల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు జనసైనికులు, వీరమహిళల మద్దతుతో అడ్డుకోవడం జరిగింది. ఉద్యమానికి రెండవ రోజైన శనివారం ఉదయం 11 గంటలకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో దుర్గాడ, చేబ్రోలు గ్రామాలనుంచి భారీ స్థాయిలో జనసైనికులచే బైక్ ర్యాలీగా ఉద్యమస్దలానికి వెళ్లి అక్కడ జనసేననాయకులు అరవ వెంకటాద్రినాయుడుకి, జనసేన గొల్లప్రోలు మండలఅధ్యక్షులు అమరాధి వల్లీరామకృష్ణకి, జనసేన సీనియర్ నాయకులు గారపాటి చంటిబాబుకి, పిఠాపురం మండల జనసేన నాయకులు గోపు సురేష్ కి, పూలమాలలు వేసి మట్టి గ్రావెల్ తవ్వకాల అడ్డగింత ఉద్యమానికి తగు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు గ్రామము నందు కోటలంక వారి చెరువు నుంచి దుర్గాడ గ్రామంలో గజరాజు చెరువు నుంచి వెంకటరాజు చెరువు నుంచి అదే విధంగా కోదండరాముని చెరువు నుంచి కూడా అనుమతులకు మించి భారీస్థాయి రెట్టింపుతో అక్రమంగా కొంతమంది గ్రావెల్, మట్టిమాపీయ వారు ప్రభుత్వపెద్దల సహకారంతో మట్టి, గ్రావెల్ చెరువుల నుండి భారీస్థాయిలో గోయ్యిలు పెట్టి మట్టిని, గ్రావెల్ ను అక్రమంగా తరలించిపోయారని అక్రమంగా తరలిస్తున్న వారికి నియోజకవర్గస్థాయి, జిల్లాస్థాయి అధికార పార్టీ నేతల అండదండలు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారుల సహకారంతో భారీ స్థాయిలో మట్టిని, గ్రావెల్ని అక్రమంగా తరలించకపోయారని దీని కారణంగా ఆయా చెరువుల ఆయకట్టురైతులు సారవంతమైన మట్టిని కోల్పోయారని దీనికారణంగా భవిష్యత్తులో రైతులకు సంబంధించిన పంటపొలాలోకి సారవంతమైన మట్టిని త్రోలుకునే అవకాశం కోల్పోయిన కారణంగా పంటలను పూర్తిస్థాయిలో పండించుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాబట్టి పిఠాపురం నియోజకవర్గం నందు గల గొల్లప్రోలుమండలం, పిఠాపురంమండలం, ఉప్పాడ కొత్తపల్లిమండలాలులో గల ఆయా గ్రామాలు రైతులు జనసైనికులు,జనసేన నాయకులు జాగ్రత్తతో ఉండి అక్రమమట్టి, గ్రావెల్ తవ్వకాలను అడ్డుకొవాలని అడ్డుకొనేవారి విషయంలో నియోజకవర్గజనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలు ఉంటాయని, అదే విధంగా ఉద్యమానికి నావంతు పూర్తి సహాయసహకారాలు అందించడం జరుగుతుందని జ్యోతుల శ్రీనివాసు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన మహిళా అధ్యక్షురాలు వినుకొండ అమ్మాజీ గొల్లప్రోలు నగర పంచాయతీ జనసేన అధ్యక్షురాలు వినుకొండ శిరీష, తాటిపర్తి జనసేన నాయకులు జనసైనికులు అడబాల వీర్రాజు, గొల్లపల్లి వీరబాబు, గారపాటి మంజునాద, సాదా తాతాజీ,గాడిదలు బుజ్జి, కుంపట్ల పెద్దకాపు, తోలేటి రాజు, సాదా రమణ, మేడిపల్లి కృష్ణ, సాదా గణేష్, గారపాటి శివ కొండలరావు, చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు జనసైనికులు దమ్ము చిన్న, ఓడబోయిన సాంబశివరావు, ఓరుగంటి నాగేశ్వరరావు, పోలవరపు మోహనకుమార్, కర్రి చిన్న, మట్ల సత్తిబాబు దుర్గాడ గ్రామనాయకులు జనసైనికులు జ్యోతుల సీతారాంబాబు, మొగిలి శ్రీను సకినాల రాంబాబు, మంతెన గణేష్, వట్టూరు శ్రీను అయినవిల్లి శ్రీను, పోలం త్రిమూర్తులు, అయినవిల్లి రాజు, జ్యోతుల శివశంకర్ అయినవిల్లి నల్ల బుజ్జి, జ్యోతుల నానాజీ, అయినవిల్లి పెద్ద శీను, జ్యోతుల శివ, జ్యోతుల కోటేష్, జ్యోతుల రాము, జ్యోతుల శివ తీడా లోవరాజు, మంతిన లక్ష్మణరావు, కుసిరెడ్డి ఆదినారాయణ, ఈర్ల శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.