పెంచిన కరెంటు ఛార్జీలపై కాకినాడ జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

కాకినాడ: పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని, పవర్ హాలిడే విధించడం వల్ల కార్మికులకు నెలలో కొన్ని రోజులు జీతం రాని పరిస్థితులు ఉంటాయి అని, ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలు, ఇప్పుడు పెరిగిన విద్యుత్ చార్జీలు.. పవర్ హాలిడే వల్ల తగుతున్న జీతాలు, పోతున్న ఉద్యోగాలు దిక్కుతోచని పరిస్థితుల్లో 23వ వార్డ్ లో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులు చేస్తున్న కోవొత్తుల ర్యాలికి మద్దతుగా కాకినాడ సిటీ ఇన్చార్జి ముత్తా శశిధర్ ఆదేశానుసారం వారికి మద్దతుగా కాకినాడ సిటీ అధ్యక్షులు సంగిశెట్టి అశోక్ ఆధ్వర్యంలో 23వ వార్డు దారపు శిరీష భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నిరసనలో భాగంగా మంగళవారం సాయంకాలం 6 గంటలకు జగన్నాధపురం మున్సిఫ్ జంక్షన్ దగ్గరనుంచి చిన్న మార్కెట్ రోడ్డు వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, కాకినాడ సిటీ నియోజవర్గ స్థాయి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీ సంఖ్య లో హాజరై జయప్రదం చేసినందుకు కాకినాడ సిటీ 23 వ వార్డు వీర మహిళ దారపు శిరీష ధన్యవాదములు తెలియ చేశారు.