ఆర్.జే.డి ఆఫీసులో మెమోరాండం సమర్పించిన కాకినాడ జనసేన

కాకినాడ సిటీ ఇంచార్జ్ మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు ఆర్.జే.డి ఆఫీసులో మెమోరాండం సమర్పించడం జరిగింది. 60 ఏళ్ల కిందటి పేద బడుగు బలహీన వర్గాల బాలికలను సాంకేతిక విద్యలో నైపుణ్యం పొంది తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఏర్పాటుచేసిన మహిళా పాలిటెక్నిక్ కళాశాలను నిర్వీర్యం చేసే దిశగా కళాశాల ప్రాంగణంలో కొంత భాగాన్ని ఆసుపత్రుల కోసం కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి కళాశాలకు చెందిన స్థలంలో ఇతర కార్యకలాపాలను చేపట్టడం అంటే విద్యార్థుల భద్రత విస్మరించడమే అని, మహిళా పాలిటెక్నిక్ కళాశాలను కొత్త కోర్సులతో అభివృద్ధి చేయడం మానేసి అత్యవసరం అనే కారణంతో ప్రాంగణాన్ని తగ్గిస్తూ పేద బడుగు బలహీన విద్యార్థుల రక్షణకు భంగం వాటిల్లే చర్యలకు ఉపక్రమించడం దారుణమని, వీటిని ఉపేక్షించడం తగదు అని ప్రజల మనోగతాన్ని ప్రభుత్వానికి మీరు తెలియజేయవలసినదిగా ఈ మెమోరాండం ద్వారా కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, ప్రోగ్రాం కమిటీ సెక్రెటరీ కర్రీ నాని, ముత్యాల దుర్గ, శ్రీమన్నారాయణ, మనోహర్ మల్లేశ్వరరావు, వాసిరెడ్డి సతీష్, రాజా తదితరులు పాల్గొన్నారు.