కొల్లాపూర్ మండల నూతన కమిటీ నియామకం

తెలంగాణ, కొల్లాపూర్ మండల జనసేన పార్టీ నూతన కమిటీ నియామించినట్లు కొల్లాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది. జనసేన పార్టీని కొల్లాపూర్ మండల పరిధిలో ప్రతి గ్రామాలలో పార్టీ బలంగా ముందుకు తీసుకు వెళ్ళే విధంగా ప్రజల్లోకి మరింత మెరుగ్గా జనసేన పార్టీని తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం జనసేన పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి జనసైనికులను నాయకులుగా తీర్చిదిద్ది ప్రణాళికతో జనసేన పార్టీ కొల్లాపూర్ మండల కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ సభ్యులందరికీ పార్టీ తరఫున మరియు పవన్ కళ్యాణ్ తరఫున రాష్ట్ర నాయకుల తరఫున నా తరఫున కొల్లాపూర్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుల తరఫున కార్యకర్తలు తరపున, జనసైనికుల తరఫున, నియమితులైన ప్రతి ఒక్క నాయకునికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలిపారు.