పవన్ కళ్యాణ్ సిఎం కావాలని ధర్మాస్థలలో ప్రత్యేక పూజలు

  • 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సిఎం కావాలని ధర్మాస్థల లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవ సంఘం

కర్ణాటక: 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సిఎం కావాలని గురువారం కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మాస్థలలో అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంద్రప్రదేశ్ లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆ దేవ దేవుని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మురళి గౌడ, తమిళనాడు జనసేన ప్రదీప్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేంద్రనాయక్, చిక్బల్లాపూర్ జిల్లా అధ్యక్షులు బుజ్జినాయక్, బెంగళూరు నగర అధ్యక్షుడు అనిల్ కుమార్, చింతామణి తాలూకా కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.