విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా కొణిదెల నాగబాబు పుట్టినరోజు వేడుకలు

విజయనగరం, జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు, అఖిల భారత చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు, మెగా బ్రదర్ కొణిదెల నాగేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా శనివారం రాత్రి స్ధానిక కోట వెనుక, విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవాసంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్ కేక్ ను కట్ చేసి వేడుకల్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ మెగాభిమానులకు ఎంతో ఆదర్శవంతమైన నాయకులు నాగబాబు అని, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అభిమాన సంఘాలను సమాజంలో ఆదర్శవంతంగా నడిపిస్తూ, రాష్ట్రంలో మెగాభిమానులను జనసేన నాయకులుగా తీర్చి దిద్దడంలో పెద్దన్నపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మెగాభిమానులు, జనసేన యువ నాయకులు ముక్కి కుమార్, యాతపేట రవి, సాయి, గుందుబార్కి నాని, ఎన్. వెంకటేష్, నాగరాజు, రమాకాంత్, సతీష్, వాసు, రాజు, తదితరులు పాల్గొన్నారు.