వై.సి.పి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

నెల్లూరు:  ఆడ లేక మద్దెల మీద పడినట్టుంది కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రస్సూ భాయ్ పరిస్థితి (జగ్గు భాయ్ గ్యాంగ్).. అభివృద్ధి చేతకాక ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతుంటాడు.. అంటూ జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో ప్రసన్న దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 48 శాతం వాటా కలిగిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బాధితులకు వెంటనే న్యాయం చేయాలి. కోవూరు నియోజకవర్గానికి తలమానికం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలి. రైతుల షేర్ హోల్డరుగా ఉన్న కంపెనీని వారి ప్రమేయం లేకుండా అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నారు.
కోవూరు షుగర్ ఫ్యాక్టరీని రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి కాపాడాలి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రసన్న దశాబ్దాలు పై బడినా అభివృద్ధి ఏమీ లేదు. ప్రశ్నించినా సమాధానం చెప్పలేక ఎదురు దాడికి ప్రతిపక్షాల మీద నోరేసుకుని దిగటం పరిపాటే. జగ్గు భాయ్ అండ్ టీం లో ఇతను ప్రస్సూ భాయ్ కూడా ఒక భాగస్వామే…
ఇతనికి కూడా గళ్ళలోకి ఎర్రచొక్కా పంపాలి. నియోజకవర్గంలో ఇసుక దోచేసావ్ గ్రావెల్ దోచేశావ్..
ఇసుక దొంగ గ్రావెల్ దొంగ నియోజకవర్గంలో ఎవరు అంటే ప్రస్సూ భాయ్ అండ్ గ్యాంగ్ అని చిన్న పిల్లోడు అడిగినా చెప్తారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని వాలంటీర్లపై అమానుషంగా మోపబోతున్న అభియోగాల నుంచి తప్పించుకునేందుకు ప్రశ్నిస్తుంటే.. దాడులు వ్యక్తిగత దూషణలు. మీ గురించే నీ అక్రమ సంపాదన గురించి నీ వ్యసనాల గురించి అందరికీ తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు మీ దెబ్బకి విలవిలలాడిపోతున్నారు. వీరు చేయిస్తున్న పనులకి రా ప్రభుత్వ ఉద్యోగులు రానున్న ప్రభుత్వాలు తమపై ఏమి చర్యలు తీసుకుంటారు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం టిడ్ కో ఇళ్ళను పేదలకు పంచి ఇవ్వలేదు. పట్టాలు ఇచ్చినా స్థలాలు కట్టివ్వలేదు. పెన్షన్లు సంక్షేమ పథకాలు తీసేస్తామని భయపెడతారు ఎవర్ని అడిగినా ఈ సారి ఈ ప్రభుత్వం ఇంటికి పోక తప్పదు అని అంటారు.. ప్రజలు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో అన్ని గమనిస్తున్నారు.రానున్న రోజుల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. మీరు చేసిన దొంగ పనులకు నోటి దూలకు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉందని గ్రహించుకోండి. మీరు మాట్లాడుతూ పోతే మీరు,మీ చుట్టూ ఉన్న గ్యాంగ్ వారు ఎవరెవరితో ఎవరెవరిని కొట్టిస్తున్నారు ఎవరెవరు ఎవరెవర్ని భయపడుతున్నారో అవినీతి వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది.
ఊహ తెలిసినప్పుడు నుంచి నెల్లూరు జిల్లాలో ప్రాచుర్యమైన షుగర్ ఫ్యాక్టరీని తిరిగి స్టార్ట్ చేస్తే ఉపాధి కలగడమే కాక జిల్లా కి పేరు ప్రతిష్టలు వస్తాయి. వీటిన మరుగున పడేసి వీటిని మరుగున పడేసి దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారని ప్రజలకు తెలియజేస్తున్నాం.. మరొకసారి ఈ ప్రభుత్వం వచ్చిందంటే కచ్చితంగా దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి సిద్ధపడతారు. ప్రజలు గమనించి వైసిపి ప్రభుత్వానికి చమర గీతం పాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు ఉపాధ్యక్షుడు సుదీర్ బద్దపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వీరమహిళ నిర్మల, చిన్నరాజా, ప్రసన్న, కేశవ, షారు, సాయి, పార్ధు, మౌనేష్, తేజ, వెంకీ, మౌనిష్, వర్షన్ తదితరులు పాల్గొన్నారు.