జనసేన పార్టీకి జై కొడదాం – పవన్ పాలనను తీసుకువద్దాం

  • బొటుకు రమేష్ బాబు ముఖ్య అతిధిగా దర్శి మండలం కట్టసింగన్న పాలెం గ్రామంలో ‘జనసేన పార్టీకి జై కొడదాం – పవన్ పాలనను తీసుకువద్దాం’ కార్యక్రమం

దర్శి: జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ సీనియర్ నాయకులు పుప్పాల పాపారావు నాయకత్వంలో దర్శి మండలంలోని కట్టసింగన్నపాలెం గ్రామంలో ‘జనసేన పార్టీకి జై కొడదాం – పవన్ పాలనను తీసుకువద్దాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి మరియు ప్రకాశం జిల్లా ప్రధానకార్యదర్శి బొటుకు రమేష్ బాబు హాజరయ్యారు. ముందుగా గ్రామ పెద్దలు స్వాగతం పలికి పోలేరు అమ్మవారి ఆలయంలో పూజాది కార్యక్రమము నిర్వహింపచేశారు. తర్వాత పుప్పాల పాపారావు మాట్లాడుతూ ప్రస్తుత అధికారపార్టీ వైషమ్యాలని ఎండగట్టారు. పాలనలో అధికార పార్టీ విఫలమైందని, వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించమని కోరారు. జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రజాసేవకోసం ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని రాజకీయాలలోకి వచ్చారని, వారిని గెలిపించుకోవాల్సిన అవసరముందని అన్నారు. జనసేన పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్ర ప్రసాద్, దొనకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు షఫీయుల్లాఖాన్, ముండ్లమూరు మండల కమిటీ ఉపాధ్యక్షులు అంచుల వీరాంజనేయులు, గంగాదేవిపల్లి గ్రామ జనసైనికుడు ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎంతో గొప్పవని, నియోజకవర్గ అభివృద్దికి స్థానిక నాయకుడైన బొటుకు రమేష్ బాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీని గెలిపించుకుందామని అన్నారు. ముఖ్య అతిధి బొటుకు రమేష్ బాబు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షుని ఆశయాలను గ్రామ ప్రజలకు వివరించి జనసేన పార్టీని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గెలిపించమని కోరారు. గ్రామంలోని ప్రజలందరూ జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. స్థానికుడనైన తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వదిలి స్థానిక ప్రజల ఆత్మగౌరవం కోసం, పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకోసం రాజకీయాలలోకి వచ్చానని, గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైనా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో వున్నానని, వెలిగొండ ప్రాజెక్ట్ సాధన ఉద్యమంలో పాల్గొన్నానని, నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవం కోసం పనిచేస్తానని, స్థానికేతరుల పాలనలో గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి సరిగా జరగలేదని, స్థానికుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. పవన్ పాలన నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవం కాపాడుతుందని, కనుక పవన్ అడుగుజాడలలోనే నడుద్దామని, వారి పాలన వచ్చేంతవరకు కృషి చేద్దామని అన్నారు. పవన్ పాలన చారిత్రక అవసరమని ప్రజలు గ్రహించి జనసేనకు జైకొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోట చిన్న కోటేశ్వరరావు, సూరే బాల గురునాథం, తోట శివ నాయుడు, రమ్మిశెట్టి కోటి, రమ్మిశెట్టి గురుబ్రహ్మం, శెట్టి సుబ్బయ్య, రమ్మిశెట్టి గురవా నాయుడు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మహిళలు, రమేష్ బాబు గారిని శాలువాతో సత్కరించి జనసేనకు జై నినాదం చేశారు. తదనంతరం బొటుకు మాజీ గ్రామ సర్పంచ్ తోట వీరబ్రహ్మం ను కలిసి వారిని పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.