తిరుపతిని జిల్లా చేసిన తరువాత పుట్టినరోజు సంబరాలు చేసుకుందాం

*వైసిపి అధికారంలోకి వచ్చాక తిరునగరి బర్త్డే ఇప్పుడు గుర్తుకు వచ్చిందా…?
*సీఎం జగన్ బాలాజీ జిల్లా ప్రకటించారు.. తిరుపతి పాలక ప్రజాప్రతినిధులు తిరుపతి నేమ్ డే జరుపుకుంటున్నారు.
*ముందు తిరుపతి జిల్లాగా ప్రకటించిన తరువాతే పుట్టిన సంబరాలు..
*మాకు పవర్ లేకపోవచ్చు.. ప్రజాదరణ ఉంది..
*జనసేన నేతల వెల్లడి.

తిరుపతి, 892 సంవత్సరాల క్రితం రామానుజన్ చార్యులు గోవింద రాజ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసిన రోజున మన పట్టణానికి ఆనాడు తిరుపతి అని నామకరణం చేశారని, ఈ పేరును సీఎం చెప్పినట్లు బాలాజీ జిల్లాగా కాకుండా తిరుపతి జిల్లాగా నామకరణం చేయాలని జనసేన పార్టీ నేతలు పట్టణ అధ్యక్షులు రాజా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి హేమ కుమార్, సుమన్ బాబు, మునస్వామి, వీరమహిళలు కీర్తన, అమృత, కోకిలలు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో వీరు మాట్లాడుతూ….(వైసిపి)స్థానిక ప్రజా ప్రతినిధులు ఈనెల 24వ తేదీ గురువారం గోవిందరాజస్వామి ఆలయంలో పుట్టినరోజు చేసుకునే ముందు మొదట సీఎం జగన్ తో మాట్లాడి తిరుపతి జిల్లాగా పేరు మార్చి తరువాత తిరుపతి బర్త్డే జరుపుకోవడంలో అర్థం ఉంటుందని విజ్ఞప్తి చేశారు. దీనికి సార్థకం బాలాజీ జిల్లా కాకుండా తిరుపతి జిల్లాగా కొనసాగితే స్థానిక ప్రజల అభిప్రాయాలను నెరవేర్చిన నేతలుగా చరిత్రలో స్థానం సంపాదించుకుంటారన్నారు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన ముఖ్యమంత్రి తిరుపతి ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరారు. ఐటీ శాఖ మంత్రి కీర్తిశేషులు గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. జనసేన నేతల గురించి తక్కువ చేసి మాట్లాడడం వైసీపీ నేతలకు సరికాదని, భవిష్యత్తులో పునరావృతమైతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.