ముస్లిం యువతికి లక్ష రూపాయలు ఆర్ధికసాయమందించిన జనసేన

చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామల చెరువు పంచాయతీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి నజీర్ ఆధ్వర్యంలో జనసేన మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ రంజాన్ మాస పర్వదినాన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులు నివసించే ప్రాంతాలను సందర్శించి అక్కడి నిత్యవసర సమస్యలను తెలుసుకుని, గ్రామ పెద్దలతో చర్చించి జనసేన ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కొన్ని నెలల కిందట చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు మౌలాలిపేటలో నివసించే తల్లి తండ్రి ఎటువంటి ఆసరా లేని నిస్సహాయురాలయిన దిల్షాద్ అనే ముస్లిం మైనారిటీ ఆడబిడ్డకు ఇళ్లు కట్టుకొనుటకు ఒక లక్ష రూపాయలు సహాయం అందించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ రూపాయలు 20000/- ఆర్థిక సహాయం అందిస్తా అని మాటిచ్చారు. ఆ మాట ప్రకారం 20వేల రూపాయలు దిల్షాద్ ముస్లిం ఆడబిడ్డకు ఆర్థిక సహాయాన్ని అందించి వారు ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయం చేశారు. జనసేన నాయకులు రహంతుళ్ళ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. పేరసానిపల్లి పంచాయతీలో తురకపల్లిలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం. నాసీర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అదే తురకపల్లి గ్రామానికి చెందిన ముస్లిం సామజిక వర్గానికి చెందిన షబ్బీర్ అతి చిన్న వయసులో కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించడం జరిగింది. అయనకు ఇద్దరు ఆడ బిడ్డలు వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ చేతుల మీదుగా రూపాయలు 15,500/- భావజాన్ ఆధ్వర్యంలో 3 నెలల నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అనంతరం జనసేన కార్యకర్తలతో సమావేశమై పార్టీ విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, కార్యదర్శి ఆనంద్, జిల్లా కార్యదర్శి బాటసారి, పాకాల మండల అధ్యక్షులు తలారి గురునాథ్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, యర్రవారి పాళ్యం మండల అధ్యక్షులు మురళి, మండల ఉపాధ్యక్షులు దినేష్, మండల ప్రధాన కార్యదర్శి రహంతుల్ల, వాసు రాయల్, తులసి బాబు మైనారిటీ నాయకులు షాజహాన్, మస్తాన్, నౌమూన్, చాంద్ బాషా, భావజాన్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, బాలాజీ, హేమకిషోర్ తమ్మిశెట్టి మోహన్, చెంగల్ రాయులు, ఆసిఫ్ మరియు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు, విద్యార్థి విభాగం నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.