మున్సిపాలీటీలో అవినీతిపై ఆరాతీసిన మాకీనీడి..!!

  • అవినీతికి పాల్పడిన అధికారులను విధులనుంచి తొలగించాలని డిమాండ్..

కాకినాడ జిల్లా పిఠాపురం, కళ్లముందే ఆవినీతి లక్షలు రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం నిత్యం పత్రికలో నిలుస్తున్నా పిఠాపురం మున్సిపాలీటీ కి ఏమైంది?. తరుచు న్యూస్ లో న్యూసెన్స్ కింద వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు సంబందిత అధికారులపై చర్యలు చేబట్టడంలేదు అంటే ప్రభుత్వమే అధికారుల అవినీతిని ప్రొతహిస్తుందా..?. దొరికినంత దోచుకోవడమేనా..? అంటూ ఇటీవల మున్సిపల్ కౌస్సిల్ సమావేశంలో అవినీతి ఆరోపణలపై జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జి మాకినీడి శేషకుమారి గళంవిప్పారు. గౌర కౌస్సిల్ సమావేశంలో వచ్చిన లక్ష లాదిపాత ఇనుపసామానం అమ్మకం వివాదం మీద డి.ఈ చెప్పిన సమాదానంపై ఆమె మండిపడ్డారు. మున్సిపాలిటీలో సుమారుగా పదిహేనేళ్ల గామూలన పడిఉన్నా పాత ఇనుప సామానం స్ర్కాబ్ ఇటీవల విధుల్లో ఉన్న డి.ఈ వేలం పాట బహిరంగంగా వేయకుండా సిక్రెట్ గా అమ్ముకుని వాటి వివరాలు ఎన్ని టన్నులు అమ్మారు..? ఎంత డబ్బు వచ్చింది అనే వివరణ సభలో తడబాటు సమాదానం రావడంపై ఆమె మీడియాలో మాట్లాడుతూ, పాత ఇనుప సామానండబ్బులు వివరణ కోరితే కౌస్సలర్స్ లంచం ఇచ్చేనడం భయం బాద్యతలేని అధికారులపై చర్యలు ఎందుకు చేబట్టడం లేదని, ఎందుకు లంచం ఇచ్చారు? ఇలా మున్సిపాలిటీల్లో ఎంత సొమ్ము దుర్వనియోగం అవుతుందో మాకు సమాదానం చెప్పాలని, ఇలాంటి వివరాలు జర్నలిజం అడిగితే వేళపాల లేకుండావచ్చేడమేనా..? మాకు వీలైనప్పుడు పిలస్తాం అప్పుడు రండి అని జర్నలిజం మీద అవహేళనగా మాట్లాడం ఎంటని అంటే విలేకర్లు అడిగిన పశ్నలకు సమాదానంలేక దాటవేసె చర్యకాకపోతే మరేమికాదని మీడియా అంటే అర్దం తెలుకోవాలని మీరు చేసిన మర్యాదకు మొట్టమొదటి సారిగా సమావేశంనుండి బయటికి వచ్చేసి బాయ్ కట్ చేసారంటే ఎంత సిగ్గు చేటో అధికారులు ఆలోచన చేయలన్నారు. సమాజంలో జరిగే అన్యాయాన్ని బట్టబయలు చేసేదే జర్నలిజం అన్నసంగతి మర్చిపోకూడదన్నారు గతంలో అంబెడ్కర్ సెంటర్ లో డ్రైన్ మ్యాన్యువాల్ కు అయినఖర్ఖు లక్ష యాబై వేలు బిల్లు అయిందని కాకి లెక్కలు చూపితే ప్రముఖ న్యాయవాది ఆరా తీయగా 60వేలు ఖర్చు చూపించారు మిగిలి సొమ్ము ఎవరు మింగారో ఏమైందో తెలియలేదన్నారు అగ్రహారంలో ప్రభుత్వం భూములు ఖబ్జదారు కాసేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు మున్సిపల్ కమీషనర్ ఏం చేస్తున్నారు అసలు పిఠాపురం లో కమీషనర్ ఉన్నాడా లేరా..?. ఉంటే ఎందుకు స్పందించడంలేదు..?. మున్సిపల్ చైర్మన్ పర్సన్ నోరు విప్పడంలేదు గౌరవ ప్రథమైన పదవిలో ఉండి మహిళా చైర్మన్ మాట్లడనివ్వకుండా కో ఆప్సన్ సభ్యులు గండేపల్లి రామారావు(బాబి) చైర్మన్ శ్రీ గండేపల్లి సూర్యవతిగారిని పక్కన పేట్టి కో ఆప్సన్ సభ్యులు మాట్లడేయడం అనేది మహిళా చైర్మన్ పర్సన్ ని అవమానించినట్లు కాదా?. మున్సిపాలిటీలోను పట్టణం అధికారనాయకుల చేసే అవినీతిపై స్థానిక శాసనసభ్యులు పెండెం దొరబాబుగారు ఎందుకు మాట్లాడంలేదు? మీరు మాట్లాడంలేదంటే మీరు అవినీతిని ప్రోత్సాహిస్తున్నారా?. అవినీతిలో మీ వాటా ఎంత అని జనసేన పార్టీ తరపున అడుగుతున్నా?. సమాదానం చెప్పండి అని సవాల్ విసిరారు. ఈ అవినీతి వ్యవహారం పైజిల్లా కలెక్టర్ గారు ఉన్నత అధికారులు దృష్టి పెట్టి చర్యలు చేబట్టాలని ఆమె మీడియాలో అన్నారు.