దళిత వాడల్లో జనచైతన్యం

పిఠాపురం రూరల్ మండలం, నియోజకవర్గానికి దశ దిశ నిర్దేశించే సామాజిక వర్గాల సమూహం. అటువంటి రూరల్ 20 దళిత వాడలు కలిగిఉన్న వాళ్ళని ఓట్లకోసం మాత్రమే ప్రాధాన్యమిచ్చే రాజకీయ పార్టీల చదరంగంలో పావులుగా మారుతున్నాయి. చైతన్యవంతులైన యువకులు మెండుగా ఉన్న వారికి బరోసా ఇచ్చే నాయత్వం కొరవడటం ప్రధాన సమస్య. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన జనసేన జెండానే కవచంగా ధరించి రూరల్ మండలంలో ఉన్న 20 దళిత వాడల్లో తన తోటి దళిత సోదరులకు అండగా నేను ఉంటానని ముందుకు వచ్చిన పిఠాపురం నియోజకవర్గ దళిత నాయకులువాకపల్లి సూర్యప్రకాశ్ సదా అభినందనీయుడు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేనపార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష సమక్షంలో మల్లాం గ్రామం నుంచి మొదలుపెట్టిన సూర్యప్రకాశ్ మొదటగా దళితవాడలో మానసిక వ్యాధితో బాధపడుతు రోజు కూడా గడవని దీన స్థితిలో ఉన్న కాలదరి విజయ్ కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యవసర సరుకులను అందించిన తరువాత పవన్ కళ్యాణ్ అభిమానులైన అనేకమంది దళిత యువకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం నందు యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ కులాలను కలిపే ఆలోచన విధానం ప్రధాన సిద్దాంతం అయిన జనసేన పార్టీ మన అందరి పార్టీ అని, రెళ్ళి కులాన్ని స్వీకరించిన పవన్ కళ్యాణ్ విశ్వనరుడు అని, జనసేన పార్టీ మాత్రమే నిజమైన లౌకికవాదం కలిగిన పార్టీ అని ఇక్కడ అందరికీ సమానత్వం లభిస్తుంది అని చెప్పారు. నేటి పాలక పక్ష నియంతృత్వ పొకడతో ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని మన న్యాయపరమైన హక్కులు సాధించుకోవాలి అంటే మీరందరూ జనసేన పార్టీలో యాక్టీవ్ రోల్ పోషించాలి అని మీకు ఏ విధమైన ఇబ్బందులు కలిగిన నేను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులైన స్థానిక దళిత యువకులు కె.ఆమోష్, కె.కుమార్, డి.వరప్రసాద్, వై.సుధీర్, జి.కళ్యాణ్, ఎన్.సూరి, భి.నగేష్, అశోక్ లను కలవగా వీరితో పాటుగా పాటి రవి, కొప్పిరెడ్డి నాని, కందా బాల, ఎన్.సతీష్, ఆర్.చంద్రశేఖర్, ఎస్.అర్జున్, మరియు రూరల్ నాయకులు అడపా శివరామకృష్ణ, రామిశెట్టి సూరిబాబు, తమ్మనబోయిన సుదర్శన్, గంజి గోవిందరాజు తదితరులు పాల్గోన్నారు.