పాఠశాలల విలీనం విద్యార్థులను కష్టాలపాలు చేస్తోంది: దారం అనిత

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 3,4,5 తరగతుల విలీనం వల్ల విధ్యార్థులు అదనంగా గదులు లేకపోవడంతో మూడు, నాలుగు, ఐదు తరగతులు తరలించడంతో చెట్ల కింద, వరండా, రేకుల షెడ్లలో తరగతులు నిర్వహించాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 4108 ఉన్నత పాఠశాలలో27 770 తరగతి గదులు నిర్మించేందుకు ప్రభుత్వం పాలన అనుమతించిందని చెప్తున్నా ఇవి కాకుండా 1186 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 3300 గదుల అవసరమని పేర్కొంది. ఈ లెక్కన 31 వేలకు పైగా గదులు అవసరం అయితే ఇప్పటిదాకా గదుల నిర్మాణం, మౌలిక వసతులు కల్పన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పాలవుతున్నారు. గతేడాది 3637 ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతి లను పావు కిలోమీటర్లు దూరంలోని 3,178 ఉన్నత పాఠశాలలో కలిపారు. ఈ ఏడాది కిలోమీటర్ దూరంగా నిర్ణయించి 5250 ప్రాథమిక పాఠశాల నుండి తరగతులను మ్యాపింగ్ చేశారు. వీటిలో సుమారు 500 పాఠశాలల్లో సమస్యలు ఉన్నట్టు ఎమ్మెల్యేలు విన్నవించారు. కిలోమీటర్ దూరం అని పేర్కొన్న కొన్నిచోట్ల ఇంతకంటే ఎక్కువ దూరం ఉన్న మ్యాపింగ్ చేసేసారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు 12 నుండి 16 ఏళ్ల మధ్య పిల్లలకు బోధించేందుకు శిక్షణ పొంది ఉంటారు. వీరు 10 ఏళ్ల లోపు పిల్లలకు బోధించాలంటే వారి మనస్తత్వం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బిఈడి చేసినవారు ప్రాథమిక తరగతులకు బోధించేందుకు బ్రిడ్జి కోర్సులు లాంటివి పూర్తి చేయాలి. చాలామందికి ఈ అర్హత లేదు. ప్రాథమిక పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులు తరలించడంతో మిగిలే ఒకటి రెండు తరగతుల విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. వీరిలో కొందరు విద్యార్థులు ప్రైవేట్ బడుల్లో చేరుతున్నారు. ఆయా విద్యాలయాల్లో కేవలం ఐదు నుండి పదిమంది పిల్లలే మిగిలి వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. విద్యార్థులు కొన్నిచోట్ల పాఠశాలలకు వెళ్లాలంటే చెరువులు దాటి వెళ్లాల్సి ఉంది పాఠశాలకు పాఠశాలకు మధ్య చెరువులు ఉంటే విలీనం చేయకూడదన్న నిబంధనను కొన్ని పాఠశాలలో పట్టించుకోవడం లేదు. చాలా చోట్ల పిల్లలు సరైన మరుగుదొడ్లు మంచినీరు తరగతి గదుల్లో విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్న అనవసరమైన నిర్ణయంతో విద్యార్థులను ఇబ్బంది పాలు చేస్తున్నారని మదనపల్లె, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలియజేసారు.