కరాటే చాంపియన్ షిప్ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన మేరుగు శివకోటి యాదవ్

  • కరాటే గురువు రచ్చ శ్రీను బాబు కు జనసేన పార్టీ తరఫున ఘనంగా సన్మానం
  • ఒక వ్యక్తి యొక్క క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసాన్ని ఏకాగ్రతను, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుంది
  • స్వీయ రక్షణ కోసమే కాకుండా కరాటే ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి చేర్చడానికి ఎంతో తోడ్పడుతుంది
  • సినిమా హీరో మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవితంలో కరాటే ఎంతో ప్రభావాన్ని చూపించి సినిమాల్లో గొప్ప నటుడిగా పేరు, ప్రఖ్యాతలను తెచ్చిపెట్టి, గొప్ప నాయకుడిగా ఎదగడానికి దోహదపడింది
  • నేటితరం పిల్లలు మొబైల్ ఫోన్లకు, యువకులు డ్రగ్స్ కి అలవాటు పడకుండా వారి దృష్టిని కరాటే విద్య వైపు మళ్ళిస్తే వివిధ రంగాల్లో రాణించి మంచి భవిష్యత్తును కలిగి ఉంటారు
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలాల్లో విద్యార్థి, యువత శారీరక-మానసిక సామర్థ్యం ఎదుగుదల కోసం కరాటే శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
  • కరాటే విద్య అభివృద్ధికి జనసేన పార్టీ తమ వంతు కృషి చేస్తుంది

నర్సంపేట పట్టణంలోని పద్మశాలి గార్డెన్స్ లో ఆదివారం షీటోకాన్ జపాన్ కరాటే డు ఇండియా హంబు సంస్థ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ 2003 పోటీలలో జనసేన నియోజవర్గ నాయకులు మేరుగు శివకోటి యాదవ్ ముఖ్య అతిధులుగా పాల్గొని, కరాటే రంగంలో నర్సంపేట ప్రాంతంలో దాదాపు 35 సంవత్సరాల నుంచి ఎంతోమంది యువకులను ప్రోత్సహించి జాతీయస్థాయిలో కరాటే ఛాంపియన్ లుగా నిలిపిన సీనియర్ గురువు రచ్చ శ్రీను బాబు విశేష సేవలకు గుర్తింపుగా జనసేన పార్టీ తరఫున అభినందిస్తూ శాలువా, మెమొంటోతో సన్మానించడం జరిగింది. అలాగే ఇటీవల జిల్లాస్థాయి కరాటే పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించి, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటే ట్రైనర్ రచ్చ. భవానిచంద్, జనసేన నాయకులు ఎలా బోయిన డేవిడ్, కొలువుల కార్తీక్, అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన వివిధ ప్రముఖులు, రాజకీయ నేతలు, విద్యావేత్తలు, అతిరథ కరాటే యోధులు, కరాటే క్రీడాకారులు- వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.