దళిత బందు వెంటనే అన్ని గ్రామాలకు వర్తింపజేయాలి

  • జనసేన పార్టీ వనపర్తి కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు

తెలంగాణ, వనపర్తి: వనపర్తి మండలంలోని, అచ్యుతాపురం గ్రామంలో జనసేన పార్టీ వనపర్తి నియోజకవర్గమంలో చేపట్టిన జనంలోకి జనసేన – ఇంటింటికీ జనసేన కార్యక్రమంలో భాగంగా వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు పర్యటించడం జరిగింది. గ్రామంలోనీ ప్రజలకు ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ విధి విధానాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలన్ని ప్రజలకు వివరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, కాగా గ్రామంలో దళిత బందు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుంది అని ఇంకా చాలా మంది గృహలక్ష్మి పథకం గురించి డబుల్ బెడ్ రూం హామీ గురించీ వెచియున్నరని, పేదలు గుడిసెల్లో జీవనం గడుపుతున్నారని వారికి తొందరగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కోఆర్డినేటర్ ముకుంద నాయుడు, జిల్లా ముఖ్య నాయకులు బాలకృష్ణ, నియోజకవర్గ నాయకులు సురేష్ యాదవ్, ప్రకాశ్, శ్రీనివాసులు, అరుణ్, మండల అధ్యక్షుడు ఉత్తేజ్ కుమార్ గ్రామ నాయకులు, నరేష్, ప్రవీణ్, లోకేష్, రవి, నవీన్, రాజేష్, నరసింహ, మద్దిలేటి, జగన్, సుధాకర్, నరేష్, నాని కార్యకర్తలు పాల్గొన్నారు.