దేవుని సన్నిధి సాక్షాత్తు తిరుమలలో సినిమా పాటలు దేనికి సంకేతం?: జనసేన

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొన్న మద్యం బాటిల్స్ ఈ రోజు సినిమా పాటలు రేపు ఏమి జరగబోతుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు..

దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమే.. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి చర్యలను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ తిరుమల ప్రతిష్టను పెంచే విధంగా చర్యలు ఉండాలే తప్ప దిగజార్చే విధంగా ఉండకూడదని ఇలాంటి చర్యలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.