పిఏసి చైర్మన్ నాదెండ్ల ను కలిసిన ఎంపీటీసి మోటూరి

తూర్పుగోదావరి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో సందడి చేస్తున్న వీరమహిళలు. ఈ మహిళా దినోత్సవంలో కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ చిందాడ గరువు ఎంపిటీసీ మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ నేత మోటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబీకులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన చిందాడగరువు జనసేన పార్టీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వర రావు. మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరపున మీరు చేస్తున్న సేవలు అభినందనీయం అని కొనియాడారు.