టీంజనసేనవైకోట రూపొందించిన క్యాలెండరుని ఆవిష్కరించిన నాదెండ్ల మనోహర్

రైల్వే కోడూరు, జనసేన ఆశయ సిద్ధాంతాలను, అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానాన్ని సామాన్యులకు సైతం అర్ధమయ్యే విధంగా వివిధ అంశాలను పొందుపరిచి రూపొందించిన రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబులవారిపల్లె మండలం, వై.కోట గ్రామం #TeamJanasenaYkota 2022 నూతన సంవత్సర క్యాలెండరుని ఆవిష్కరించిన PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వర రావు, శ్రీ పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గొన్నారు. యువకులయిన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేస్తున్న కృషిని శ్రమని గుర్తించి #టీంజనసేనవైకోట సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన నల్లంశెట్టి కిషోర్, నరసింహ, చవ్వాకుల రెడ్డిమణి, కొండేటి మనోజ్, భాస్కర్, బాబు, కలవకుంట చాంగల్ రాయుడు, గణేష్ లను అభినందించారు.