డిజిటల్ క్యాంపెయిన్ లో నూజివీడు జనసేన

నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ సూచనల మేరకు #GoodMorningCMSir అనే హ్యాష్ ట్యాగ్ తో నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డిని మరియు ఎమ్మెల్యే ని లేపే కార్యక్రమంలో భాగంగా ఆదివారం చాట్రాయి మండలం
తుమ్మగూడెం గ్రామంలో( తుమ్మగూడెం – చిత్తపూరు రోడ్డు), గుడిపాడు గ్రామంలో( గుడిపాడు – మర్లపాలెం రోడ్డు),
మర్లపాలెం గ్రామంలో గ్రామంలో మర్లపాలెం – సోమవారం
పోలవరం గ్రామంలో ( పోలవరం – వెలగలపల్లి),
రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ నిరసన తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి పాపారావు, చల్లపల్లి నవీన్ సురేష్, నాగరాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.